చిట్ చాట్ : అక్కి విశ్వనాథరెడ్డి – ‘అడవి కాచిన వెన్నెల’ జోనర్ సినిమా ఇప్పటివరకూ హాలీవుడ్లో కూడా రాలేదు.

చిట్ చాట్ : అక్కి విశ్వనాథరెడ్డి – ‘అడవి కాచిన వెన్నెల’ జోనర్ సినిమా ఇప్పటివరకూ హాలీవుడ్లో కూడా రాలేదు.

Published on Jul 28, 2014 5:36 PM IST

Akki-Viswanad-Reddy
అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, రిషి, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. ఈ సినిమా ద్వారా అక్కి విశ్వనాథరెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 01న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అక్కి విశ్వనాథరెడ్డితో కాసేపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ నుంచి డైరెక్టర్ గా ఎలా అయ్యారు.?

స) నేను చదుకునే రోజుల్లోనే నా ఫ్రెండ్స్ కి ఒక స్టొరీ చెప్పాను. అది వాళ్లకి బాగా నచ్చడంతో ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసేయ్యాలనుకున్నాను. కానీ చదువు పూర్తవ్వగానే జాబ్ రావడంతో సెటిల్ అయ్యాను. ఉద్యోగ రిత్యా చాలా చోట్ల పనిచేసాను, విదేశాలకు కూడా వెళ్ళొచ్చాను. ఇండియా రాగానే ఇక ఆలస్యం చెయ్యకుండా సినిమా చెయ్యాలని ఈ సినిమా మొదలు పెట్టాను. డైరెక్టర్ గా నాకు ఎక్కడా అనుభవం లేదు. కానీ నేను ఎప్పుడూ ఇండస్ట్రీని, ఫిల్మ్ మేకింగ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాన్ని.. ఆ అనుభవంతోనే ఈ సినిమా చేసాను.

ప్రశ్న) అడవి కాచిన వెన్నెల కథాంశం ఏమిటి.?

స) అడవి – వెన్నెలని ఇతివృత్తంగా చేసుకొని రాసిన కథే ఇది. నా కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ మా ఊళ్ళో ఒకతను లంకె బిందెల కోసం తన ఆస్తి, ఇల్లు అన్ని పోగొట్టుకున్నాడని చెప్పాడు. అది నాకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఆ పాయింట్ తీసుకొని దానికి కాస్త కమర్షియల్ హంగులతో పాటు కొన్ని పాత్రలని జోడించి ఈ సినిమా రెడీ చేసాను. ఈ సినిమా లంకె బిందెలతో స్టార్ట్ అవుతుంది, కేవలం లంకె బిందెల కాకుండా వేరే వేరే అంశాలను కూడా ఇందులో చూపించాను. ఒక సైన్స్ ఫిక్షన్ – హిస్టారికల్ ఫాంటసీని కలిపి ఈ సినిమా చేసాను. ఇలా రెండింటిని కలిపిన జోనర్లో ఇప్పటి వరకూ హాలీవుడ్ లో కూడా సినిమా రాలేదు. తెలుగులోనే ప్రధమం కావడం చెప్పదగిన విషయం.

ప్రశ్న) ఈ సినిమాని మీరు నిర్మించడానికి గల కారణం ఏమిటి?

స) ఫిల్మ్ నగర్ కి వచ్చినప్పుడు ఈ సినిమాని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పంపిద్దాం అనుకున్నాను. అక్కడ బాగుంటే ఇక్కడ మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్నాను. కానీ నేను పలువురు నటీనటులని కలసిన తర్వాత ఇక్కడే సినిమా చెయ్యాలని అనుకున్నాను. నాకు ఇక్కడ సినిమా నిర్మాతలు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలియదు. దాంతో నేనే నిర్మించేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో ప్రధాన పాత్రల గురించి చెప్పండి.?

స) అరవింద్ కృష్ణ బాగా చదువుకున్న కుర్రాడు. అలాగే అతని మెటల్ ని డిటెక్ట్ చెయ్యగలిగే దానిలో స్పెషలిస్ట్. అలాంటి అతను ఒక దానికోసం అన్వేషిస్తూ ఉంటాడు. అది ఏమిటా అనేది మీరు సినిమాలోనే చూడాలి. అలాగే మీనాక్షి దీక్షిత్ నేషనల్ లెవల్ రైఫిల్ షూటర్. తనకి ఎప్పటికైనా ఒలంపిక్స్ లో మెడల్ సాధించాలనేదే లక్ష్యం.

ప్రశ్న) ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువ స్కోప్ ఉందన్నారు.? దాని గురించి చెప్పండి.?

స) ఈ సినిమాలో దాదాపు 26 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది. వినోద్ కుమార్ సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. అందుకోసం సౌత్ అఫ్రికాని సిజిలో క్రియేట్ చేసాం. అలాగే క్లైమాక్స్ కోసం పలు దేశాల్లో బాగా ఫేమస్ అయిన కొన్ని ప్లేస్ లని సిజిలో క్రియేట్ చేసాం.

ప్రశ్న) ఈ సినిమాకి హైలైట్స్ ఏమవుతాయి.?

స) ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమా కథ. సీతారామశాస్త్రి పాటలు, 26 నిమిషాల సిజి వర్క్ మెయిన్ హైలైట్స్ అవుతాయి.

ప్రశ్న) ఈ సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి మీరేమి చెబుతారు.?

స) ఈ సినిమా ద్వారా ఓ కొత్త పాయింట్ ని చెప్పబోతున్నాం. ఇందులో కామెడీ, యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఈ సినిమాని తీసాను. కాబట్టి అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

అంతటితో మా చిట్ చాట్ ని ముగించి అక్కి విశ్వనాథరెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు