ఇంటర్వ్యూ : కృతి సనన్ – దోచేయ్.. ఓ డిఫరెంట్ సినిమా!

ఇంటర్వ్యూ : కృతి సనన్ – దోచేయ్.. ఓ డిఫరెంట్ సినిమా!

Published on Apr 23, 2015 1:10 PM IST

Kriti-sanan
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి సనన్.. తన మొదటి సినిమాతోనే అందంలో, నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోపంతీ సినిమాలో నటించిన కృతి, ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా నాగ చైతన్య హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన దోచేయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రేపు (ఏప్రిల్ 24న) విడుదలవుతున్న సందర్భంగా కృతి సనన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) దోచేయ్ సినిమా గురించి చెప్పండి?

స) ‘దోచేయ్’ సినిమా క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఓ డిఫరెంట్ కథ. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మంచి కామెడీతో సాగిపోయే థ్రిల్లింగ్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇంతవరకూ చూడని సరికొత్త స్క్రీన్‌ప్లేను ఈ సినిమాలో చూడొచ్చు. ఎక్కడా ప్రేక్షకుడికి ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం తెలియకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతీ ఒక్కరూ తమ సీట్లోనుంచి కదలకుండా ఈ సినిమా చూస్తారని ధీమాగా చెబుతున్నా.

ప్రశ్న) ఈ సినిమాలో అవకాశమెలా వచ్చింది?

స) దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. కథ విన్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యా. నా పాత్ర కూడా బాగుండడంతో వెంటనే ఓకే చేశా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో మీరా అనే పాత్రలో కనిపిస్తా. మీరా అందరి లాంటి అమ్మాయి కాదు. ఏదైనా కొత్తగా చేయాలనుకునే మనస్థత్వమున్న అమ్మాయి. చాలా బబ్లీగా ఉంటూ అందరినీ ఆకట్టుకునే ఇలాంటి పాత్రలో కనిపించడం కొత్తగా అనిపించింది.

ప్రశ్న) టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇలా రెండు పరిశ్రమల్లో నటించడం ఎలా ఉంది?

స) నిజానికి టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వర్కింగ్ స్టైల్ ఒకేలా ఉంటుందనేది నా అభిప్రాయం. ఎక్కడైనా అందరూ సినిమాపై ప్యాషన్‌తోనే పనిచేస్తారు. నాకైతే టాలీవుడ్, బాలీవుడ్‌ల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. ఇక్కడ, అక్కడా టెక్నీషియన్స్ అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు. నాకు కనిపించిన తేడా ఏదైనా ఉందంటే.. అది భాష మాత్రమే!

ప్రశ్న) నాగ చైతన్యతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

స) నాగ చైతన్య చాలా ఫన్ లవింగ్ పర్సన్. తాను పెద్ద స్టార్‌ననే విషయాన్ని మరచిపోయి అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తాడు. ఈ సినిమా విషయంలో నాగ చైతన్యతో కలిసి పనిచేయడం ఓ మంచి ఎక్స్‌పీరియన్స్. తెలుగు మాట్లాడడం విషయంలో బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడిప్పుడే తెలుగు మాట్లాడడం మొదలుపెట్టా.

ప్రశ్న) దర్శకుడు సుధీర్ వర్మ గురించి చెప్పండి?

స) సుధీర్ వర్మ తనకేం కావాలనే విషయం సరిగ్గా తెలిసిన వ్యక్తి. నటులు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడు. స్క్రిప్ట్ విషయంలో, షాట్ కంపోజిషన్ విషయంలో ఆయకున్న నాలెడ్జ్ అద్భుతం. ఇతరుల నుంచి ఏమాత్రం ఇబ్బంది పడకుండా సలహాలు తీసుకోవడం ఆయన దగ్గరున్న మంచి లక్షణం.

ప్రశ్న) తరువాతి సినిమాలేంటి?

స) ప్రస్తుతం హిందీ ఫజీ, దిల్‌వాలే సినిమాల్లో నటిస్తున్నా. ఆ రెండూ పెద్ద సినిమాలే! ఇక ఈ మధ్యనే కొన్ని తెలుగు అవకాశాలు కూడా వస్తున్నాయి. సరైన టైమ్‌లో మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే తెలుగులోనూ ఓ సినిమా స్టార్ట్ చేస్తా.

ఇక అక్కడితో కృతి సనన్‌తో మా ఇంటర్వ్యూ ముగిసింది. రేపు విడుదలవుతున్న కృతి సనన్ సినిమా దోచేయ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. 123తెలుగు ఆల్ ది బెస్ట్.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు