చిట్ చాట్ : సాజిద్ ఖురేషి – నాలుగు కిస్ సీన్స్ ఉంటే సినిమా చూడరు..

చిట్ చాట్ : సాజిద్ ఖురేషి – నాలుగు కిస్ సీన్స్ ఉంటే సినిమా చూడరు..

Published on Jun 2, 2013 10:40 AM IST

sajid-Qhuresi

శ్రీ హీరోగా, సుప్రజ హీరోయిన్ గా పరిచయమవుతున్న ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమా ద్వారా సాజిద్ ఖురేషి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాజిద్ ఖురేషితో కాసేపు ముచ్చటించాము. ఈ చిట్ చాట్ లో సాజిద్ డైరెక్టర్ తను ఎలా డైరెక్టర్ అయ్యారు, అతనికి ఇష్టమైన దర్శకులెవారు అనే విషయాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అసలు సినిమాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి?

స) నా ఫ్యామిలీది సినిమా బ్యాక్ గ్రౌండ్. మా నాన్నగారు ఖురేషి రాయల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే సంస్థ పేరుతో నైజాంలో హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. గత 7 సంవత్సరాలుగా చేయటం లేదు. చిన్ననాటి నుంచి ఆయనతో పాటే ఉంటూ డిస్ట్రిబ్యూషన్ కి సంబందించిన పనులు చూసుకునే వాన్ని అప్పటినుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే డైరెక్టర్ అయ్యాను.

ప్రశ్న) మీకు మొదటి సినిమా అవకాశం వచ్చింది?

స) నేను గత కొద్ది సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నాను. నాన్న గారికి ముంబైలో డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్ తో పరిచయం ఉండడం వల్ల అబ్బాస్ – మస్తాన్ లాంటి దర్శకుల వద్ద కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను. అలాగే సతీష్ కౌశిక్ అనే డైరెక్టర్ దగ్గర కొద్ది రోజులు అసిస్టెంట్ గా పని చేసాను. ఆ తర్వాత ఓ స్టొరీ తయారు చేసుకొని చెన్నై వెళ్లాను. నేను చెప్పిన స్టొరీ అక్కడి నిర్మాతలకి నచ్చింది. అదే సమయంలో ‘నడువుల కొంజెం పక్కత కానోం’ అనే సినిమా చూసి నా సినిమా మొదలు కావడానికి టైం ఉండడంతో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేద్దామని అక్కడున్న ఆ చిత్ర నిర్మాతలని కలిసి రీమేక్ రైట్స్ తీసుకొని ఈ సినిమా చేసాం. అలా డైరెక్టర్ అయ్యాను.

ప్రశ్న) టైటిల్ వెరైటీ గా ఉంది. ఈ సినిమా గురించి చెప్పండి?

స) మరొక రోజులో పెళ్లి చేసుకోవాల్సిన హీరో తలకి దెబ్బ తగలడంతో తన జీవితంలోని ఒక సంవత్సర కాలాన్ని మర్చిపోతాడు. అందులో భాగంగానే తన పెళ్లి గురించి కూడా మర్చిపోతాడు. అలాంటి టైంలో తన ఫ్రెండ్స్ మరియు అతని ఫ్యామిలీ తనకి ఆ గతాన్ని ఎలా గుర్తు చేసారు? చివరికి ఆ పెళ్లి జరిగిందా? లేదా? అనేదే ఈ సినిమా కథాంశం.తమిళ్ తో పోల్చుకుంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది.

ప్రశ్న) ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్స్ తో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

స) ఇంతకు ముందు ఈ నేపధ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ సినిమాల్లో పూర్తిగా గతం మర్చిపోతారు కానీ మా సినిమాలో కేవలం ఒక సంవత్సరం మాత్రమే మరిచిపోతాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏమీ ఉండవు. పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.

ప్రశ్న) శ్రీ ని హీరోగా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి? ఈ సినిమాతో అతని ఇమేజ్ ఏమన్నా మారుతుందా?

స) నేను ఎంచుకున్న కథకి హీరోయిజం ఉన్న ఫేస్ అవసరం లేదు, చాలా సహజంగా మనలో ఒక్కడిలా ఉండే పేస్ కావాలి. శ్రీ ఫేస్ లో ఎలాంటి హీరోయిజం ఉండదు అలాగే మనందరిలో ఒక్కడిగా ఉంటాడు. అందుకే శ్రీని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఈ సినిమాతో 101% కచ్చితంగా శ్రీ ఇమేజ్ మారిపోతుంది. అతనికి మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) హీరోయిన్ తెలుగమ్మాయి అన్నారు. ఎలా సెలెక్ట్ చేసారు?

స) ఈ సినిమా ద్వారా సుప్రజని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. ఆ అమ్మాయిది తిరుపతి, మన తెలుగమ్మాయి. ఆ అమ్మాయి గతంలో జెమినిలో వచ్చిన ఓ డాన్స్ షోలో పాల్గొంది, అప్పుడుచూసాం, అలాగే ఇప్పటి తన ఫోటోలు చూసి మేము ఎంచుకున్న కథకి ఆ అమ్మాయి లుక్ బాగుంటుందని సెలెక్ట్ చేసాం.

ప్రశ్న) సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగుంది. వారిద్దరి గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో ఒక్క హీరో తప్ప మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కొత్తవారే. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఐ. మార్టిన్ జో. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వాడు. ఈ సినిమాతో అతనికి మంచి బ్రేక్ వస్తుంది. అలాగే మ్యూజిక్ గునవంత్ సేన్ చేసాడు. నేను ముంబైలో ఉన్నప్పటి నుంచి అతను నాకు పరిచయం, సినిమాకి చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు.

ప్రశ్న) ఇప్పుడు వస్తున్న దర్శకులంతా లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ సినిమాలతో పరిచయమవుతుంటే మీరేంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పరిచయం అవుతున్నారు?

స) లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటే నాలుగు కిస్ సీన్స్, నాలుగు హగ్స్, నాలుగు వల్గర్ డైలాగ్స్ ఉండే సినిమాలు నేను చేయలేనండి. ఈ సినిమాలో సిగరెట్, మందు, కిస్, హాగ్, రొమాన్స్ లాంటి సీన్స్ ఏమీ లేవు, నేను ఇక తీయబోయే సినిమాల్లో కూడా ఉండవు. నాకు తెలిసి నాలుగు కిస్ సీన్స్ ఉంటే సినిమాలు చూడరు. నా సినిమా చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకూ అందరూ చూసే విధంగా ఉండాలి. అందుకే నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాను. ఈ సినిమా పక్కా వెజిటేరియన్ సినిమా ఇందులో ఎలాంటి నాన్ వెజ్ ఉండదు.

ప్రశ్న) మీరు ఎలాంటి తరహా సినిమాలు చేయాలనుకుంటున్నారు? అలాగే టాలీవుడ్ లో మీకు ఇష్టమైన దర్శకులెవరు?

స) దర్శకుడన్నాక అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటారు, నేను అంతే కానీ నాకు రామ్ గోపాల్ వర్మ గారి టేకింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే టాలీవుడ్లో ఎస్.ఎస్ రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారంటే చాలా ఇష్టం.

ప్రశ్న) ఈ సినిమాని ఎన్ని రోజుల్లో తీశారు? అలాగే ఎప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు?

స) సినిమా మొత్తాన్ని కేవలం 27 రోజుల్లో పూర్తి చేసాము. 19 రోజులు టాకీ పార్ట్ తీశాము, మరో 8 రోజుల్లో 5 సాంగ్స్ పూర్తి చేసాము. జూన్ 15 కల్లా సెన్సార్ కూడా పూర్తవుతుంది. మిగతా సినిమా విడుదల తేదీలు చూసుకొని జూన్ చివరికల్లా సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం.

ప్రశ్న) ఈ సినిమా తర్వాత మీరు చేస్తున్న సినిమాలు ఏమిటి?

స) నేను ఇదివరకే చెప్పినట్టు తెలుగు – తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేయడానికి తమిళ్ హీరో పార్థిబన్ ఓకే చెప్పారు. హీరో పాత్రకి శరత్ కుమార్ గారిని సంప్రదిస్తున్నాం. ఆగష్టు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

అంతటితో డైరెక్టర్ సాజిద్ ఖురేషికి అల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ముగించాం. ఎంతో సున్నితంగా మాట్లాడే సాజిద్ తో చిట్ చాట్ ఎంతో సరదాగా సాగింది. మీరు కూడా ఈ చిట్ చాట్ ని బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం.

రాఘవ

Click here for English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు