ఇంటర్వ్యూ : నిఖితా రెడ్డి – నితిన్ తో మా బ్యానర్‌లో హట్రిక్ మూవీ అవుతుంది.

ఇంటర్వ్యూ : నిఖితా రెడ్డి – నితిన్ తో మా బ్యానర్‌లో హట్రిక్ మూవీ అవుతుంది.

Published on Dec 6, 2014 1:52 PM IST

nikitha-reddy

నితిన్ సోదరిగా, సుధాకర్ రెడ్డి కుమార్తెగా చిత్రసీమలో ప్రవేశించిన నిఖితా రెడ్డి నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి నిర్మించిన తొలి రెండు సినిమాలు ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మంచి విజయాలు సాధించాయి. తాజాగా ‘చిన్నదాన నీకోసం’ అంటూ హట్రిక్ కి రెడీ అయ్యారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రమ్ క్రిస్మస్ రోజున, డిసెంబర్ 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు నిర్మాత. ఆమె చెప్పిన సంగతలు మీకోసం..

ప్రశ్న) రెండు వరుస విజయాల తర్వాత మీ బ్యానర్ నుండి వస్తున్న సినిమా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?

స) వన్ ఇయర్ స్క్రిప్ట్ వర్క్ చేశాం. అంతా పక్కగా కుదిరిన తర్వాత షూటింగ్ ప్రారంభించాం. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలు విజయవంతం కావడంతో మా పేరు, భాద్యత పెరిగాయి. ఆ రెండు సినిమాల కంటే 10 రెట్లు ‘చిన్నదాన నీకోసం’ ఉంటుంది. నితిన్ తో మా బ్యానర్‌లో హట్రిక్ మూవీ అవుతుంది.

ప్రశ్న) నితిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

స) మన పక్కింటి తరహా కుర్రాడి పాత్రలో నితిన్ కనిపిస్తాడు. ఒక చిన్నదాని కోసం ఈ చిన్నోడు ఎటువంటి పాట్లు పడ్డాడు అనేది సినిమా కథ. చాలా స్టైలిష్ గా ఉంటాడు.

ప్రశ్న) హీరోయిన్ గా కొత్తమ్మాయిని తీసుకోవడానికి గల కారణం..?

స) ఈ ప్రేమకథకు ఒక ఫ్రెష్ పేస్ ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే మిస్తీ చక్రవర్తిని ఎంపిక చేశాం. ఆ అమ్మాయికి తెలుగు రాకపోయినా భావం అర్ధం చేసుకుని బాగా నటించింది. ఆమె నటనకు మంచి పేరొస్తుంది.

ప్రశ్న) కరుణాకరన్ సినిమాలలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

స) ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరి క్యారెక్టర్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. తన ప్రతి సినిమాలోనూ కరుణాకరన్ గారు, హీరోయిన్ ను చాలా అందంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అలానే చూపించారు. మిస్తికి ప్రాముఖ్యత గల పాత్ర లభించింది.

ప్రశ్న) కరుణాకరన్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటంది..?

స) వెరీ కూల్. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ప్రేమ సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయన అనుభవం చాలా ఉపయోగపడింది. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘చిన్నదాన నీకోసం’ సినిమాను తెరకెక్కించారు. కరుణాకరన్ స్టైల్లో సాగిపోయే రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

ప్రశ్న) యాక్షన్ సినిమాలకు నితిన్ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా..? హిట్స్ అందించిన రొమాంటిక్ జోనర్ లోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు..?

స) ప్రెజెంట్ ట్రెండ్ చూసుకుంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు హిట్ అవుతున్నాయి. సినిమాలో వయోలెన్స్ ఎక్కువయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం లేదు. ప్రేక్షకుల అభిరుచి మేరకే తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే రొమాంటిక్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఫ్యూచర్ లో యాక్షన్ సినిమాలు చేస్తాడు.

ప్రశ్న) ప్రస్తుతం నితిన్ మార్కెట్ పెరిగింది. అది ఈ సినిమాకు ఎంతవరకూ హెల్ప్ అయ్యింది..?

స) యూరోప్ లో 40 డేస్ షూట్ చేశాం. మొత్తం సినిమా నిర్మాణానికి 23 కోట్ల వరకూ ఖర్చయింది. నితిన్ మార్కెట్ పెరగడంతో సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. విడుదలకు ముందే సినిమా బిజినెస్ అంతా జరిగిపోయింది.

ప్రశ్న) నితిన్ సినిమాలలో మీ జోక్యం ఎంతవరకూ ఉంటుంది..?

స) నా ఒక్కరిదే అని కాదు, అందరిదీ ఉంటుంది. ముఖ్యంగా నితిన్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. స్క్రిప్ట్ దశలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. నేను, నాన్నగారు తనకు అవసరమైన సలహాలు ఇస్తుంటాం.

ప్రశ్న) అఖిల్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

స) త్వరలో.. అఖిల్ సినిమా వివరాలు వెల్లడిస్తాం. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు