వినోదంతో పాటు మంచి కథ ఉన్నట్లు కనిపించింది !

వినోదంతో పాటు మంచి కథ ఉన్నట్లు కనిపించింది !

Published on Jan 20, 2018 11:55 AM IST

మంచు విష్ణు హీరోగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచరి అమెరికా యాత్ర’. ఈ సినిమా జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత వినోదభరితంగా తెరకెక్కించారు. తమన్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం ఈ సినిమాకు ఆకట్టుకోబోతున్నాయి. ప్రజ్ఞ్య జస్వాల్ ఈ సినిమాలో విష్ణుకు జోడిగా నటించింది.

డార్లింగ్ స్వామి మాటలు రాసిన ఈ సినిమాకు విక్రమ్ రాజ్ స్క్రీన్ ప్లే అందించారు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ట్రైలర్ చూడగానే సినిమాలో వినోదంతో పాటు మంచి కథ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తరువాత మంచి పాజిటివ్ తో ముందుకు వెళ్ళాలని కోరుకుందాం.

ట్రైలర్ కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు