మహేష్ 23 ఫస్ట్ లుక్ కు ఫైనల్ డేట్ ఫిక్సైంది !


మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మహేష్ 23 చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారైంది. మురుగదాస్ సినిమా మొదలుపెట్టి చాలా కాలం కావొస్తున్నా ఇప్పటి దాకా ఫస్ట్ లుక్, టైటిల్ లాంటివి రిలీజ్ చేయకపోవడంతో మహేష్ అభిమానవులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. చివరికి స్వయంగా మహేష్ బాబే కాస్త ఓపికపట్టండని చెబితే గాని ఫ్యాన్స్ శాంతిచలేదు.

మహేష్ బాబు కూడా అభిమానుల నిరీక్షణను గమనించి త్వరగా షూట్ పూర్తి చేస్తూ మురుగదాస్ తో కలిసి ఫస్ట్ లుక్ ను సిద్ధం చేయించాడు. ఈ లుక్ ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. అదే రోజు సినిమా టైటిల్ ఏమిటనేది కూడా తెలిసే అవకాశముంది. ఇకపోతే ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుతున్న యూనిట్ ఏప్రిల్ 15 నుండి కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ రానున్నారు.

 

Like us on Facebook