‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ఇది పక్కా మాస్ సినిమా – నిర్మాత దిల్ రాజు

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ఇది పక్కా మాస్ సినిమా – నిర్మాత దిల్ రాజు

Published on Nov 27, 2014 12:36 PM IST

subramanyam-for-sale-openin
‘తొలిప్రేమ’ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి, ‘ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్ కి ఎలాంటి యూత్ ఫుల్ ఇమేజ్ వచ్చిందో.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’తో తేజుకి అలాంటి ఇమేజ్ వస్తుంది. అని అన్నారు నిర్మాత దిల్ రాజు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, వివి వినాయక్, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్, శిరీష్, లక్ష్మన్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

హీరో సాయి ధరమ్ తేజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… హరీష్ శంకర్ మార్క్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’. పక్కా మాస్ సినిమా. డిసెంబర్, జనవరి, ఫిభ్రవరి నెలలో ఇండియాలో షూటింగ్ చేస్తాం. ఏప్రిల్ లో అమెరికాలో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మాస్, క్లాస్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే విధంగా తేజు క్యారెక్టర్ డిజైన్ చేశాను. చక్కని ప్రేమకథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాను. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ తేజ్ కెరీర్లో గుర్తుండిపోతుంది. ఫుల్ లెంత్ కమర్షియల్ హీరోగా చూపించాలనుకుంటున్నాను. నా హోం బ్యానర్ లో, దిల్ రాజు అన్నయ్యతో మరో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. తేజు నటించిన ‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా కంటే ఈ సినిమా భారిగా ఉంటుంది. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు