కృష్ణవంశీ ప్రభావం నాపై చాలా ఉంది : ‘లడ్డు’ దర్శకుడు శశిధర్

కృష్ణవంశీ ప్రభావం నాపై చాలా ఉంది : ‘లడ్డు’ దర్శకుడు శశిధర్

Published on Sep 27, 2016 2:25 PM IST

sasidhar
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన శశిధర్, తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ముందుకొచ్చారు. ‘లడ్డు’ పేరుతో రూపొందిన ఈ సినిమా ఈమధ్యే యూట్యూబ్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక తాను గతంలో తెరకెక్కించిన ఎడ్యుకేషనల్ షార్ట్ ఫిల్మ్ ‘ఓంకారం’ లాగానే ‘లడ్డు’ కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతోందని, ఈ షార్ట్ ఫిల్మ్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో తన పేరు చూసుకోవడం కోసం కష్టపడుతున్నానని అన్నారు.

ఇదే సందర్భంగా మాట్లాడుతూ.. “కాకినాడలో పుట్టి పెరిగిన నేను, సినిమాలంటే ఇష్టంతో ఇంజనీరింగ్ పూర్తయ్యాక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్‌మేకింగ్ కోర్సు చేశా. ఆ తర్వాత కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశా. ఓంకారం పేరుతో నేను తెరకెక్కించిన ఓ ఎడ్యుకేషనల్ షార్ట్ ఫిల్మ్‌కు నంది అవార్డు కూడా అందుకున్నా. ఇప్పుడు రవివర్మ ప్రధాన పాత్రలో నటించిన లడ్డు సినిమా కూడా దర్శకుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే నా వద్ద పలు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. కృష్ణవంశీ గారి ప్రభావం నాపై చాలా ఉంది. భవిష్యత్‌లో తెలుగులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతున్నా” అని అన్నారు.

‘లడ్డు’ షార్ట్ ఫిల్మ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు