యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా ఆడియో నిన్నటి రాత్రి ఘనంగా శిల్పకలవేదికలో జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా నందమూరి హరికృష్ణ విచ్చేశారు. అలాగే ఎన్.టి.ఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యాడు. అన్ని సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా లాంచ్ చేసాక ఎన్.టి.ఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి ఆడియోని రిలీజ్ చేసి మొదటి సిడిని హరికృష్ణకి అందించి ‘నాన్నకు ప్రేమతో’ అనేదానికి సార్ధకత చూపారు. అలాగే ఈ సినిమా ఆడియోని దేవీశ్రీ పాదర్ అయిన సత్యమూర్తికి అంకితం ఇచ్చారు.
స్టేజ్ పైన మాట్లాడిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ గా ఫీలవ్వడమే కాకుండా వారికి సత్యమూర్తి గారితో తమకున్న అనుబంధాన్ని పంచుకోవడమే కాకుండా వాళ్ళ ఫాదర్ తో వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని పంచుకొని బాగా ఎమోషనల్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తనకి సపోర్ట్ గా నిలిచిన అందరికీ థాంక్స్ చెప్పడమే కాకుండా బాగా ఎమోషనల్ అయ్యారు. అలానే సుకుమార్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు సత్యమూర్తికి సంతాపం తెలియజేయడమే కాకుండా వారి వారి ఫాదర్స్ ని గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘మేమంతా నాన్న పిచ్చోల్లం అండి, ఇది నా సినిమా కాదు సుకుమార్ జీవితం. నా పాత్రలో సుకుమార్ ని ఊహించుకోవాలి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో సుక్కు వాళ్ళ ఫాదర్ ని ఊహించుకోవాలి. మా తల్లి తండ్రులతో పాటు అందరి అమ్మ నాన్నలకు మేమిస్తున్న నీరాజనం ఈ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అని’ అన్నాను.


