ప్రముఖ ఎడిటర్ కిషోర్ మృతి

ప్రముఖ ఎడిటర్ కిషోర్ మృతి

Published on Mar 6, 2015 4:41 PM IST

Kishore-passes-away
ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ కిషోర్ (36) ఈ మధ్యాహ్నం మృతి చెందారు. తమిళంలో అద్భుత సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఆయన ఇకలేరనే వార్తతో పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కిషోర్.. దర్శకుడు వెట్టిమారన్ సినిమా ఎడిటింగ్ పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు . హాస్పిటల్‌కు తరలించగా, మెదడులో రక్తం గడ్డ కట్టి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తమిళంలో ఆయన ఎడిటర్‌గా పనిచేసిన ‘ఆడుకాలం’ సినిమాకు గానూ ఆయనను జాతీయ అవార్డు వరించింది. ఆడుకాలం సినిమా.. పందెం కోళ్ళు పేరుతో జనవరి 30న తెలుగులో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మింపబడిన సినిమాలు గగనం, ఉలవచారు బిర్యాని వంటి సినిమాలు ఆయనకు తెలుగులోనూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కిషోర్ మృతి పట్ల అటు తెలుగు, తమిళ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రతిభా శాలి, యువకుడైన కిషోర్ ఇలా అర్థాంతరంగా చలించడంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు