నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా దృశ్యం – వెంకటేష్

నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా దృశ్యం – వెంకటేష్

Published on Jul 26, 2014 9:22 AM IST

venkatesh
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ చేసిన మరో ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా జూలై 11న విడుదలై అందరి చేత మన్ననలు పొందుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నికల్ టీం హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ ‘నా 27 ఏళ్ళ కెరీర్లో ‘దృశ్యం’ లాంటి ఓ మంచి సినిమాని చేసాను. నటుడిగా నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా ఇది. ఈ సినిమా విజయం నన్ను మరిన్ని కొత్త తరహా సినిమాలు చేసేందుకు స్పూర్తిని ఇచ్చింది. మా సురేష్ ప్రొడక్షన్స్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న టైంలో ఇలాంటి సినిమా రావడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

ఈ సక్సెస్ మీట్ కి హాజరైన డా. రామానాయుడు, సురేష్ బాబు, నదియా, శ్రీ ప్రియ, కృతిక, బేబీ ఎస్తర్, రావికాలే, పరుచూరి గోపాలకృష్ణ మొదలైన వారు కూడా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు