శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదల..?

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదల..?

Published on Jul 24, 2014 12:39 PM IST

gopala-gopala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆగస్ట్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆగస్ట్ 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదల చేయడం శుభసూచికం అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ఎలా దర్శనం ఇవ్వనున్నాడో ఆగస్ట్ 16న తెలుస్తుంది. దర్శక నిర్మాతలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు – శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిషోర్ పార్ధసాని(డాలీ) దర్శకుడు. పవన్ పాత్ర 25 నిముషాలు ఉంటుందని సమాచారం. 2015 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు