శేఖర్ కమ్ముల హీరో మళ్ళీ వస్తున్నాడు..!

శేఖర్ కమ్ముల హీరో మళ్ళీ వస్తున్నాడు..!

Published on Dec 2, 2016 4:23 PM IST

venkatapuram
సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమా అప్పట్లో ఒక సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నటించిన నిఖిల్, వరుణ్ సందేశ్‌లు హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిఖిల్ ఏకంగా స్టార్ అయిపోయారు. ఇక హ్యాపీడేస్ గ్యాంగ్‌లోనే టైసన్ అనే పాత్రలో కనిపించిన రాహుల్ కూడా ఆ తర్వాత అడపదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనొక ఆసక్తికర సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు

గుడ్ సినిమా గ్రూప్ నిర్మిస్తోన్న ‘వెంకటాపురం’ అన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ తాజాగా ఆన్‌లైన్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రాహుల్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు పోస్టర్ స్పష్టం చేస్తోంది. వేణు మడికంఠి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఓ డిఫరెంట్ కథతో సినిమా తెరకెక్కుతుందని నిర్మాణ సంస్థ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు