‘కుమారి 21F’ రీమేక్ రైట్స్ కోసం భారీ పోటీ!!

‘కుమారి 21F’ రీమేక్ రైట్స్ కోసం భారీ పోటీ!!

Published on Nov 24, 2015 2:50 PM IST

Kumari21f
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బ్యానర్ ద్వారా నిర్మాతగా మారి తనే కథ – స్క్రీన్ ప్లే అందించి చేసిన సినిమా ‘కుమారి 21F’. తెలుగుకు పెద్దగా పరిచయం లేని బోల్డ్ కాన్సెప్ట్ తో, గ్లామర్ పరంగా కాస్త బౌన్దరీస్ ని దాటి చేసిన సినిమానే ‘కుమారి 21F’. రాజ్ తరుణ్ – హేభ పటేల్ జంటగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఓవరాల్ గా రాజ్ తరుణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే యూనివర్సల్ గా యూత్ కి నచ్చే బోల్డ్ కాన్సెప్ట్ మరియు అంతరికీ నచ్చే పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండడంతో ఈ సినిమా ఇతర భాషల నిర్మాతలని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆయా భాషల వారు రీమేక్ రైట్స్ కోసం తెగ పోటీ పడుతున్నారు. అలాగే సుకుమార్ కి మాకివ్వాలంటే మాకివ్వాలి అంటూ బంపర్ ప్రైజ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ‘కుమారి 21F’ సినిమా పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు రెండింతలు వసూలు చేస్తుండడం వలన నిర్మాతలు రీమేక్ రైట్స్ పై మరింత ఆసక్తి చూపుతున్నారు. మరి సుకుమార్ ఫైనల్ గా ఈ సినిమా రైట్స్ ని ఎవరెవరికి ఇస్తాడు అన్నది త్వరలోనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు