భారీ ఫైట్ చిత్రీకరణలో లింగా

భారీ ఫైట్ చిత్రీకరణలో లింగా

Published on Sep 23, 2014 1:00 AM IST

lingaa
సూపర్ స్టార్ రజిని, డాషింగ్ డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లింగా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ మాస్టర్ లీ విట్టాకర్ “లింగా భారీ క్లైమాక్స్ మరో రెండు రోజుల చిత్రీకరణ ” మిగిలుందని ట్వీట్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన పాత్రపోషించనున్నాయని సమాచారం

‘డై హార్డ్’, ‘ఫాస్ట్ ఫైవ్’ మరియు ‘అభ్రహం లింకన్’ వంటి పలు హాలీవుడ్ సినిమాలకు లీ ఫైట్ మాస్టర్ గా పనిచేసాడు. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు