హైదరాబాద్ వరద భాదితులకు రానా సహాయం !

rana1
గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ నగర జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగడంతో జన జీవనం స్తంభించింది. చాలా చోట్ల ప్రజలు త్రాగునీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారికి సహాయం అందించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంతో పాటే తెలుగు పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా హీరో రానా అయితే వారి సహాయార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఈరోజు 24 గంటల పాటు ఫిలిం నగర్లో ఉన్న తమ రామానాయుడు స్టూడియోస్ తెరిచే ఉంటుందని, ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు అక్కడికొచ్చి తమ వంతు సాయంగా నిల్వ ఉండే ఆహారం గాని, నీళ్లు గాని, దుప్పట్లు గాని అందజేయవచ్చని, వారిని బాధితులకు తామే స్వయంగా చేరవేస్తామని, మీరు చేసే చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుందని ప్రజలకు తెలియజేశారు. ఇతర సినీ ప్రముఖులు నానై,మంచు లక్ష్మి, మనోజ్ కూడా రానాకు మద్దత్తు భాదితులకు సహాయం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Like us on Facebook