‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు !

‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు !

Published on Dec 3, 2016 5:12 PM IST

ram-charan-in
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుసగా రెండు పరాజయాల తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘ధృవ’. తమిళ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, చరణ్ మేకోవర్ అన్నీ సినిమాపై నమ్మకాల్ని పెంచాయి. ఇకపోతే ఈ సినిమాకి ఆడియో వేడుక కూడా లేకపోవడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసింది టీమ్.

ఈ నెల 4న జరగనున్న ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో దీనికి సంబందించిన స్టేజ్, ఇతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మినిష్టర్ కేటీఆర్, చిరంజీవి, ఇతర మెగా హీరోలు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు రానుండటంతో నిర్వాహకులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు