‘సింగం 3’ టీంలో మరో భారీ మార్పు

‘సింగం 3’ టీంలో మరో భారీ మార్పు

Published on Nov 29, 2015 7:59 PM IST

suriya
స్టార్ తమిళ హీరో కానీ తను చేసిన డిఫరెంట్ సినిమాల వలన తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ స్టార్ హీరోనే సూర్య. సౌత్ లో సూర్యకి ఉన్న ఇమేజ్ మరియు క్రేజ్ ని ఒక్కసారిగా డబుల్ చేసిన సినిమా ‘సింగం’. సింగం అనే సినిమాని కంటిన్యూ చేయడం కోసం సెకండ్ పార్ట్ తీసారు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా సింగం సీరీస్ కి మూడవ పార్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. సౌత్ ఇండియాలో మొదటి సారిగా వస్తున్న ట్రైలాజీ సింగం కావడం విశేషం.

మొదటి రెండు పార్ట్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కానీ మూడవ పార్ట్ కి తనని కాదని అనిరుధ్ రవిచంద్రన్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ నిమార్చారు . ఫైనల్ గా సింగం 3వ పార్ట్ కి హారీష్ జైరాజ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అది కూడా ఈ సినిమాలో ఫస్ట్ మేజర్ షెడ్యూల్ ని వైజాగ్ లో మొదలు పెట్టనున్నారు. సుమారు 30 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరిపిన తర్వాత తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్ లో సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెడతారు.

‘సింగం’ సిరీస్‌లోని రెండు పార్ట్స్ లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో పార్ట్ లోనూ కొనసాగనున్నారు.అలాగే మరో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు