తమిళనాట చెక్కుచెదరని ‘ఐ’ కలెక్షన్స్

తమిళనాట చెక్కుచెదరని ‘ఐ’ కలెక్షన్స్

Published on Jan 25, 2015 12:09 AM IST

i-review
శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ విడుదలైన అన్ని చోట్లా అదరగొట్టే ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా మూడు భాషలలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 100కోట్లను సాధించింది. తెలుగులో ఈ చిత్రం మిక్సడ్ రివ్యూలు అందుకున్నా తమిళ కలెక్షన్లకు అడ్డురాకపోవడం గమనార్హం.

మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా తమిళ వెర్షన్ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్లను సంపాదిస్తుంది. శంకర్ తీసిన గ్రాండ్ విజువల్స్, విక్రమ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, రెహమాన్ సంగీతం ఈ విజయానికి దోహదపడ్డాయి. ఈ వారం మూడు రోజులు సెలవు దొరకడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు