ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : రాజ్ తరుణ్ – కుదిరితే నిఖిల్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : రాజ్ తరుణ్ – కుదిరితే నిఖిల్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది !

Published on May 30, 2017 3:42 PM IST


ఈ సంవత్సరం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తో హిట్ అందుకుని ‘అంధగాడు’ వంటి మరో వైవిధ్యమైన చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకురానున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. జూన్ 2వ తేదీన ఈ చిత్రం రిలీజ్ సందర్బంగా ఆయన మాతో పాలీ విషయాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘అంధగాడు’ సినిమా గురించి చెప్పండి ?
జ) సినిమా చాలా బాగుంటుంది. ఇది ఒక జానర్ కు చెందిన సినిమా అని చెప్పలేం. ఎమోషన్, లవ్, థ్రిల్, కామెడీ అన్నీ ఉంటాయి. రెండు గంటల పాటు సినిమా చూసి కుటుంబమంతా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు.

ప్ర) మీ ముందు సినిమాలకి దీనికి తేడా ఏంటి ?
జ) నా ముందు సినిమాలు వేటికవే ఒక్కో జానర్లో ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్. ప్రతి పావుగంటకి జానర్ మారిపోతూ ఉంటుంది. సినిమాలో చాలా ట్విస్టులుంటాయి.

ప్ర) ఇందులో చూపులేని వ్యక్తిగా నటించారు కష్టమనిపించలేదా ?
జ) ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చాలా సరదాగా, ఈజీగా చేసేశాను. కథలో మొదటి 40 నిముషాలు మాత్రమే చు లేకుండా ఉంటాను.

ప్ర) సినిమాని వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేయాలని ఎవరనుకున్నారు ?
జ) ఆయన కథ చెప్పేటప్పుడే నాకనిపంచింది ఈ కథను ఆయన డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని. కథలో చాలా ట్విస్టులున్నాయి. వాటన్నిటిపైన ఆయనకు మాత్రమే గ్రిప్ ఉంది. అందుకనే ఆయననే చేయమని చెప్పా. ఆయనక్కూడా డైరెక్షన్ అంటే ఇష్టం కాబట్టి ఒప్పుకున్నారు.

ప్ర) హీరోగా వరుస విజయాలందుకుంటున్నారు కదా ఎలా ఫీలవుతున్నారు ?
జ) కెరీర్ చాలా విజయవంతంగా ఉంది. అందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సినిమా అంటే ఇష్టం. ఒక హీరోగానే కాదు పరిశ్రమలో ఏ పని చేయడానికైనా సిద్దంగానే ఉంటాను.

ప్ర) నిఖిల్ మీకు మంచి ఫ్రెండ్ కదా ఆయనతో మల్టీ స్టారర్ ఆలోచనలేమైనా ఉన్నాయా ?
జ) అవును నిఖిల్ నాకు మంచి ఫ్రెండ్. మొన్న కూడా అనుకున్నాం ఇద్దరం కలిసి సినిమా చేయాలని. కానీ ఇంకా సరైన కథ దొరకలేదు. దొరికితే తప్పకుండా చేస్తాను.

ప్ర) వరుస సినిమా వలన పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నారా ?
జ) నాకు పర్సనల్ లైఫ్ అంటే సినిమానే. ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ సినిమాలు ఉండాలని కోరుకుంటాను.

ప్ర) మీరు కథల్ని ఎలా ఎంచుకుంటారు ?
జ) కథ విషయంలో నాకు పెద్దగా పట్టింపులేమీ ఉండవు. ఎవరు కథ చెప్పిన వింటాను. నచ్చితే వెంటనే ఓకే చేస్తాను. కాస్త తేడా కన్ఫ్యూజన్ అనిపించినా ఒప్పుకోను. ఏదైనా సరే నాదే ఫైనల్ డెసిషన్. ఇంకెవరి సలహా తీసుకోను.

ప్ర) మీ దగ్గరకొచ్చే కొత్త దర్శకుల నుండి ఏం ఆశిస్తారు ?
జ) ముందే చెప్పాను కదా నాకు కథ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉండవు. కథ నచ్చితే ఓకే చెప్పేస్తాను. అంతేగాని ఇలాంటి కథలే కావాలి అనే డిమాండ్ ఏం లేదు.

ప్ర) ఈ సినిమాకు ప్రీమియర్లు ప్లాన్ చేశారు కదా దాని వెనకున్న అసలు రీజన్ ?
జ) అంటే అది నిర్మాతల ఆలోచన. ఇందులో ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమీ లేవు. సినిమాలో మంచి కంటెంట్ ఉంది కాబట్టి అది ముందుగా జనాల్లోకి వెళితే బాగుంటుదనేదే ఆలోచన. పైగా సినిమా రిజల్ట్ ముందుగా తెలుస్తుంది కాబట్టి నాక్కూడా టెంక్షన్ ఉండదు.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు ?
జ) తప్పకుండా ఈ సినిమా నాకు బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఇది నా కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లే సినిమా వుంటుందని నా గట్టి నమ్మకం.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం ‘రాజుగాడు యమ డేంజర్’ చేస్తున్నాను. అది కూడా కొత్తగా ఉంటుంది. అది క్లిఫ్టమేనియా (తెలీకుండానే దొంగతనాలు చేయడం) కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రజనీ డైరెక్షన్లో ఒకటి చేస్తున్నాను. అది అవగానే దిల్ రాజుగారి ప్రొడక్షన్ మరొక సినిమా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు