అటువంటి సినిమాలు చూడటానికి ఇష్టపడను : తమన్నా

అటువంటి సినిమాలు చూడటానికి ఇష్టపడను : తమన్నా

Published on Apr 30, 2016 11:22 PM IST

Tamannaah
దక్షిణాదిన స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో తప్పక వినిపించే పేరులో తమన్నా ఒకటి. ’బాహుబలి’ లో అవంతిక గా నటించిన తరువాత తన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల తను నటించిన ’ఊపిరి’ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

నటిగా వివిధ రకాల పాత్రలు పోషిస్తున్న తమన్నా ను వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలు చేయడానికి లేదా చూడటానికి ఇష్టపడతారని అని అడిగితే, ‘‘నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేస్తా. కానీ సినిమా చూసే విషయంలో మాత్రం నాకు ఏడుపు తెప్పించే సినిమాలకి దూరంగా ఉంటా. ఆ తరహా చిత్రాలు నాకు చేయబుద్ధి కాదు. నా ఉద్దేశ్యంలో సినిమా అంటే ఆనందమే. అందుకే కాసేపు ఆనందాన్ని ఇచ్చే సినిమాలను చూడటానికి ఇష్టపడతా. మెదడుకి పనిపెడుతూ మన ఆలోచనల్ని మంచి వైపుకు తీసుకెళ్లే సినిమాలన్నా ఇష్టమే కానీ తెరపై ఏడుపుని మాత్రం నేను భరించలేను. అటువంటి సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడను’’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమిళ్ లో ’ధర్మదురై’ సినిమాతో పాటు విశాల్ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన తమన్నా తెలుగులో ’అభినేత్రి’, ’బాహుబలి’ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు