హ్యాపీ ఎండింగ్ తో ఇంప్రెస్ చేసిన ఇలియానా

హ్యాపీ ఎండింగ్ తో ఇంప్రెస్ చేసిన ఇలియానా

Published on Nov 23, 2014 4:15 PM IST

ilena
సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ లో తమ సత్తా చాటుకోవడానికి వలస పోతున్న హీరోయిన్స్ లో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు.. బర్ఫీ సినిమాతో హిట్ అందుకున్న ఇలియానా ఆ తర్వాత ‘మైన్ తేరా హీరో’ సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత ఈ గోవా బ్యూటీ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి చేసిన సినిమా ‘హ్యాపీ ఎండింగ్’.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ విమర్శల్లో ఇలియానా పెర్ఫార్మన్స్ మరియు లుక్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ బుక్ రాసిన డెబ్యూ రైటర్ పాత్రని ఇలియానా హ్యాపీ ఎండింగ్ లో చేసింది. సైఫ్ అలీ ఖాన్ – ఇలియానా కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమాకి రాజ్ – డికే డైరెక్టర్స్. సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు