అఖిల్, ఆర్జీవీల సినిమా ఆగిపోనుందా ?

అఖిల్, ఆర్జీవీల సినిమా ఆగిపోనుందా ?

Published on Apr 21, 2018 3:12 PM IST


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని అఖిల్ తో కొద్ది రోజుల క్రితమే ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో వరుస పరాజయాల్లో ఉన్న వర్మ ఏంటి, అఖిల్ ను డైరెక్ట్ చేయడమేమిటని కొందరు అభిమానులు సైతం కొంత నిరుత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే సూచనలు ఉన్నట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించేలా చేసింది తానేనని ఒప్పుకుంటూ వర్మ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలో తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ కళ్యాణ్, ఇతర మెగా హీరోలు చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్ వంటి వారంతా బయటికొచ్చి వర్మను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రేక్షకులు, మెగా అభిమానుల్లో వర్మపై నెగెటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్మ చేతిలో అఖిల్ ను పెట్టడం మంచిది కాదనే యోచనలోకి నాగార్జున ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఇకపోతే అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టగా వర్మ నాగార్జునతో ‘ఆఫీసర్’ అనే సినిమాను చేశారు. మే 25న ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు