ఆది, తాప్సిల సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ !

ఆది, తాప్సిల సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ !

Published on May 24, 2018 2:54 PM IST

కేవలం కమర్షియల్ సినిమానాలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారమున్న కథలని, పాత్రల్ని చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు ఆది పినిశెట్టి, తాప్సి. ఆది తెలుగు, తమిళ భాషల్లో హవా చూపుతుంటే తాప్సి హిందీ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని కూడ చేస్తున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తెలుగులో ఒక సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఆసక్తికరమైన రీతిలో ‘నీవెవరు’ అనే టైటిల్ ను నిర్ణయించారు మేకర్స్. కొద్దిసేపటి క్రితమే హీరో నాని ఈ టైటిల్ ను రివీల్ చేశారు. ఇందులో ఆది, తాప్సిలతో పాటు రితిక సింగ్ కూడ నటించనుంది. హరినాథ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు