నేడే కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ ఫస్ట్ లుక్

నేడే కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ ఫస్ట్ లుక్

Published on May 24, 2015 12:21 PM IST

kamal-haasan
నటుడిగా, కథా రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా, నిర్మతగా తన టాలెంట్ ని నిరూపించుకొని ఎన్నో సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ హీరో కమల్ హాసన్. ఇటీవలే విడుదలైన ఉత్తమ విలన్ సినిమాతో విమర్శకులను మెప్పించిన కమల్ హాసన్ తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి చేయనున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకి తమిళంలో ‘తూంగావనం’ అనే టైటిల్ పెడితే, తెలుగులో ‘చీకటి రాజ్యం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. చాలా రోజుల తర్వాత కమల్ డైరెక్ట్ తెలుగులో చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

అంతే కాకుండా షూటింగ్ మొదలవుతున్న ఈ రోజే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు ప్రకాష్ రాజ్, త్రిషలు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ రోజు త్రిష, ప్రకాష్ రాజ్ లు కలిసి చీకటి రాజ్యం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబద్ లో 20 రోజులు జరగనుంది. ఆ తర్వాత 40 రోజుల షెడ్యూల్ చెన్నైలో జరుగుతుంది. ఈ సినిమా ద్వారా కమల్ అసిస్టెంట్ రాజేష్ సెల్వ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కమల్ తన హోం బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు