ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – మెగాస్టార్ నా నటన గురించి మాట్లాడటం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్..!

ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – మెగాస్టార్ నా నటన గురించి మాట్లాడటం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్..!

Published on Apr 23, 2016 5:53 PM IST

aadhi
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడైన ఆదిపినిశెట్టి తేజ దర్శకత్వంలో వచ్చిన ’ఒక విచిత్రం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. తరువాత ఆయన తమిళ్ చేసిన ’మృగం’ అయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత ’వైశాలి’, ’గుండెల్లో గోదారి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ’సరైనోడు’ సినిమాతో తొలిసారిగా ప్రతినాయకుడిగా మనముందుకు రాబోతున్న సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు

ప్రశ్న) ప్రతినాయకుడి పాత్రలు ఇకమీదట కూడా చేస్తారా..?
స) చేస్తాను. పాత్ర ఆసక్తి కరంగా ఉండి నటనకు మంచి అవకాశం ఉంటే ఎందుకు చేయను?

ప్రశ్న) మీకు తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కదా? అక్కడ ఎటువంటి స్పందన లభిస్తున్నది?
స) ఈ సినిమా చూసిన వాళ్ళు నా పాత్రను ఎంతగానో అభిమానిస్తున్నారు. నా కెరీర్ లో ఇంత త్వరగా మంచి పాత్ర చెసినందుకు అందరూ అభినందిస్తున్నారు.

ప్రశ్న) ఈ పాత్రకు ఎలా సిద్ధం అయ్యారు..?
స) నేను ఈ పాత్ర కొసం చాలా కష్టపడ్డాను. కానీ సెట్ లోకి వెళ్ళిన తర్వాత దర్శకుడు బోయపాటి శీను గారు ఈ పాత్ర గురించి ఇచ్చిన సలహాలు ఈ పాత్ర ని మరింత పవర్ ఫుల్ గా తయారు చేశాయి. నేను కేవలం ఆయన చెప్పిన సూచనలు, సలహాలు పాటించాను అంతే..

ప్రశ్న) బన్నీ తో పని చేయడం ఎలా ఉంది?
స) నాకు బన్నీ చిన్నప్పటి నుంచీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ లో మేం ఎన్నోసార్లు మాపాత్రల గురించి చర్చించుకునేవారం. బన్నీ చాలా కష్టపడ్డాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపైన మోసాడు.

ప్రశ్న) ఈ సినిమాకి మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
స) ఈ సినిమా చూసిన చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా… మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి చాలా సేపు నాపాత్ర గురించి, నా నటన గురించి మాట్లాడటం మాత్రం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు