ఇంటర్వ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ – ‘స్పీడున్నోడు’ కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే మూవీ.

ఇంటర్వ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ – ‘స్పీడున్నోడు’ కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే మూవీ.

Published on Feb 4, 2016 2:17 PM IST

srinivas
సక్సెస్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లుడు శీను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు అతను హీరోగా వస్తున్న రెండవ సినిమా ‘స్పీడున్నోడు’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము బెల్లంకొండ శ్రీనివాస్ తో కాసేపు ముచ్చటించి సినిమా విశేషాలు తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ రెండవ సినిమా కోసం రీమేక్ ని సెలక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి?
స) నేను తమిళ మూవీ సుందర పాండ్యన్ సినిమా చూసాక, ఆ సినిమాలో చెప్పిన ఫ్రెండ్షిప్ థీమ్ చూసి థ్రిల్ అయ్యాను. ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది అనే ఫీల్ నాకు వచ్చింది.
ప్రశ్న) మరి ఈ సినిమా విజయంపై ఎంత నమ్మకంగా ఉన్నారు?
స) నా మొదటి సినిమా టైంలో ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఫీలింగ్ లో చాలా నర్వస్ అండ్ టెన్షన్ లో ఉన్నాను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నేను మళ్ళీ మరో ఎంటర్టైనింగ్ ఫిల్మ్ తో వస్తున్నాను. కచ్చితంగా చెప్తున్నాను.. స్పీడున్నోడు సూపర్ హిట్ అయ్యే సినిమా..

ప్రశ్న) మొదటగా ఈ సినిమా చేయడం కోసం ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు?
స) అల్లుడు శీను సినిమా తర్వాత నేను 30 – 40 కథలు విన్నాను. కానీ ఏదీ నాన్ను ఎగ్జైట్ చేసేలా లేదు.. ఆ టైంలోనే భీమనేని గారు ఈ సినిమాతో వచ్చారు, నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి ఓకే చెప్పాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుందో చెప్పండి?
స) నేను కర్నూల్ కి చెందిన చాలా సింపుల్ అండ్ కూల్ పర్సన్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకి స్ట్రెంగ్త్ అండ్ వీక్ నెస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కోసం ఎంతన్న చేయడానికి సిద్దపడే పాత్ర. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే పాత్ర.

ప్రశ్న) తెలుగు వెర్షన్ కోసం మీరేమన్నా మార్పులు చేసారా?
స) అవునండి, తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాలో చాలానే మార్పులు చేసాం.. చాలా వరకూ రీమేక్ అనే ఫీలింగ్ రాదు.

ప్రశ్న) రెండవ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కోసం తమన్నా ని ఎందుకు తీసుకున్నారు?
స) అల్లుఅదు శీనులో చేసిన స్పెషల్ సాంగ్ లో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాహుబలి సినిమా తర్వాత తమన్నా రేంజ్ మారిపోయింది. అందరూ తనని స్క్రీన్ పైన చూడాలని కోరుకుంటున్నారు. అందుకే తననే ఈ సాంగ్ కి సెలక్ట్ చేసాం.

ప్రశ్న) భీమనేని శ్రీనివాస్ లాంటి సీనియర్ డైరెక్టర్ తో పనిచేయడం ఎలా ఉంది?
స) భీమనేని గారితో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. ఆయన రీమేక్ సినిమాలకి మాస్టర్. ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసాడు. ఆయన నుంచి చాలా నేర్చుకోవడమే కాకుండా నన్ను నేను ఎలా కొత్తగా ప్రెజంట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను.

ప్రశ్న) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి శ్రీనుతోనే ఉంటుందా?
స) అవును.. బోయపాటి గారితోనే ఖరారైంది. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు