ఇంటర్వ్యూ : దుల్కర్ సల్మాన్ – నాకు తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.

ఇంటర్వ్యూ : దుల్కర్ సల్మాన్ – నాకు తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.

Published on Apr 23, 2015 2:09 PM IST

Dulquar-Salmaan
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా మోళీవుడ్ కి పరిచయమై అక్కడ ట్రెండ్ సెట్ చేస్తున్న హీరో దుల్కర్ సల్మాన్. ఈ యంగ్ హీరో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే కన్మణి’ డబ్బింగ్ వెర్షన్ ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా గత వారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ వచ్చి మీడియాతో ముచ్చటించి, సినిమాని సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘ఓకే బంగారం’ సినిమాకి, ముఖ్యంగా మీకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలవుతున్నారు.?

స) తమిళంలో ఇది నాకు రెండవ సినిమా, తెలుగులో నా ఫస్ట్ డబ్ సినిమా. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచి చాలా మంది తెలుగు వారు నా పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి వెల్ కమ్ ఇచ్చిన తెలుగు వారికి నా స్పెషల్ థాంక్స్..

ప్రశ్న) మీ ఫస్ట్ తెలుగు సినిమా.. మీ ఫాదర్ సినిమా చూసాక ఎలా ఫీలయ్యారు.?

స) ఒక బంగారం చాలా కలర్ఫుల్ అండ్ యూత్ ఫుల్ మూవీ. మణిరత్నం గారి నుంచి ఇలాంటి సినిమా రావాలని ఆశిస్తుంటారు. ముఖ్యంగా మా ఫాదర్ కూడా మనసు పరంగా ఇంకా కుర్రాడే, ఆయన కుర్రాడిలానే అందరితో ఉంటారు. ఆయనకి సినిమా బాగా నచ్చింది. ఎప్పుడు ఆయన నా సినిమాల గురించి ఎక్కువ చెప్పారు. ఈ సినిమా విషయంలో హీ ఈజ్ హ్యాపీ..

ప్రశ్న) మణిరత్నం సినిమాలో చేయడం ఎలా అనిపించింది.?

స) మణిరత్నం గారితో చేయడం చాలా హ్యాపీ.. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. మణిరత్నంతో చేయడంతో నా కల నెరవేరింది. ఆయనతో సినిమా అనగానే ఓకే చెప్పెసేవాన్ని, కానీ అయన కూర్చో బెట్టి ఐడియా చెప్పి, ఆ తర్వాత ఫుల్ స్టొరీ నేరేట్ చేసారు.

ప్రశ్న) మలయాళంలో సక్సెస్ఫుల్ హీరోస్ లో మీరొకరు.. మలయాళంలోలానే ఇతర భాషల్లో కూడా సినిమాలు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారా.?

స) నో.. నేను అలా ఏమీ ప్లాన్ చెయ్యలేదు. నేను వరుసగా మలయాళం సినిమాలు చేస్తున్నాను. నా ఫోకస్ ని డైవర్ట్ చెయ్యాలని అనుకోవట్లేదు. అలాగే నేను ఇతర భాషల్లో సినిమా చేయడానికి సిద్దమే. కానీ సినిమా చెయ్యాలి అంటే భాష కాస్త తెలిసి ఉండాలి, దాన్ని బట్టి బయట సినిమాలు ప్రిఫర్ చేస్తాను.

ప్రశ్న) ఇప్పటి వరకూ చాలా మంది దర్శకులతో పనిచేసారు. మరి మణిరత్నం స్పెషాలిటీ ఏమిటి.?

స) మణిరత్నం స్టేజింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి సీన్ ని చాలా రియలిస్టిక్ గా, బిలీవబుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆయనకి ఎంత చిన్న స్పేస్ ఇచ్చినా అందులో ప్రతి దాన్ని ఫీలయ్యేలా చూపిస్తారు. ఒక సీన్ లో ఏదో ఇద్దరు కూర్చొని డైలాగ్స్ చెప్పుకున్నట్టు ఉండదు. యాక్టర్స్ రియల్ గా అలా ఫెలయ్యేలా చేస్తారు. అదే ఆయన స్పెషాలిటీ..

ప్రశ్న) టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ తో చేయడం, మీ ఇద్దరి కెమిస్ట్రీ గురించి చెప్పండి.?

స) నా సెకండ్ సినిమాకి నిత్య మీనన్ తో కలిసి పనిచేసాను. అప్పటికే నిత్యా చాలా సినిమాలు చేసింది, నా కన్నా సీనియర్. సినిమా టైంలో చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. చాలా ఫ్రెండ్లీ అండ్ టాలెంటెడ్ హీరోయిన్. ఒకసారి మనకు బాగా తెలిసిన వారు మనతో కలిసి సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మొదట కంఫర్టబుల్ ఉంటుంది. దానివల్లే కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుంది.

ప్రశ్న) మీరు తెలుగు సినిమాలు చూస్తారా.? మీకు తెలుగులో నచ్చిన హీరోస్ ఎవరు.?

స) కచ్చితంగా.. టైం దొరికినప్పుడల్లా తెలుగు సినిమాలు చూస్తుంటాను. నా బెంగుళూరు డేస్ సినిమాని ఇక్కడ బాగా ఆదరించారు. అలాగే నేను కూడా మనం, మగధీర లాంటి సినిమాలు చూసాం. కొన్ని సినిమాలకు భాషా భేదం, లిమిట్స్ ఉండవు. తెలుగులో ప్రతి ఒక్క హీరోకి ఒక్కో స్టైల్ ఉంది. నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటే ఇష్టం. నన్ను నేను మెరుగు పరచుకోవడానికి ప్రతి స్టార్ లోనూ ఉన్న క్వాలిటీస్ ని అబ్సర్వ్ చేస్తుంటాను.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు