చరణ్ కోసం సుకుమార్ మార్పు చేస్తాడా..?

చరణ్ కోసం సుకుమార్ మార్పు చేస్తాడా..?

Published on May 27, 2026 11:00 PM IST

rc17

టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మధ్య ‘పుష్ప-2’ సమయంలో చిన్న గ్యాప్ వచ్చిందని, అలాగే దేవిశ్రీ హీరోగా మారుతుండటంతో రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోయే తర్వాతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం చరణ్ – సుకుమార్ సినిమాకు సంబంధించిన కథాంశం మాత్రమే లాక్ అయింది కానీ, పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. ఫుల్ స్క్రిప్ట్ లాక్ అవ్వడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే కథా నేపథ్యాన్ని బట్టి దేవిశ్రీ ప్రసాద్‌ను కొనసాగించాలా లేదా అనే దానిపై సుకుమార్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు