ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్ వంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలను రాసే విధానంపై ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సందీప్ వంగా సినిమాల్లోని రొమాంటిక్ సీన్స్ చూసి హీరోయిన్లకు కేవలం గ్లామర్ పాత్రలే ఉంటాయని అనుకోవడం పొరపాటని, ఆయన క్యారెక్టర్లను ఎంతో బలంగా, ఎమోషనల్ డెప్త్‌తో రాస్తారని హేమంత్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ‘అర్జున్ రెడ్డి’లో శాలినీ పాండే, ‘యానిమల్’లో రష్మిక మందన్న పాత్రలను ఆయన గుర్తుచేశారు.
ఇక నటీనటుల మధ్య పోలికలు పెట్టడం సరికాదని, కేవలం పాత్రకు సూట్ అవుతారనే త్రిప్తి దిమ్రిని సెలెక్ట్ చేశారని చెబుతూ.. ఈ సినిమాలో ఆమె ఖచ్చితంగా అందరి అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


