ఇంటర్వ్యూ : గౌతమ్ మీనన్ – ‘సాహసం శ్వాసగా..’ క్లైమాక్స్ అనుకున్నట్టుగా తీయలేకపోయా!

ఇంటర్వ్యూ : గౌతమ్ మీనన్ – ‘సాహసం శ్వాసగా..’ క్లైమాక్స్ అనుకున్నట్టుగా తీయలేకపోయా!

Published on Nov 15, 2016 5:28 PM IST

gautham-meonan
దర్శకుడు గౌతమ్ మీనన్‌ది ఒక ప్రత్యేకమైన శైలి. తెలిసిన కథలనే చాలా తెలివిగా, తనదైన కోణంలో చెప్తాడన్న గొప్ప పేరుందాయనకు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ గత శుక్రవారమే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా రొమాన్స్, యాక్షన్ టచ్‌తో యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సందర్భంగానే సాహసం శ్వాసగా సాగిపో అనుభవాల గురించి గౌతమ్ మీనన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ఎంతోకాలం ఎదురుచూయించిన మీ సినిమా మొత్తానికి ఇప్పటికి వచ్చేసింది. రెస్పాన్స్ ఎలా ఉంది?

స) చాలా బాగుంది. తెలుగు వర్షన్‌తో పాటు తమిళ వర్షన్‌కు(అచ్చమ్ ఎన్బదు మదమైదా – శింబు హీరో) కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. యంగ్‌స్టర్స్ అంతా రొమాన్స్, యాక్షన్‌ను మిక్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిలీజ్‌కి ఇంత లేట్ అయినా అందరూ ఆ విషయాన్ని పక్కనబెట్టేసి సినిమా చూస్తున్నారు. సో, అందరం హ్యాపీ.

ప్రశ్న) సంవత్సరం పాటు రిలీజ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి?

స) తెలుగు రిలీజ్‌కు ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. తెలుగులో ఎప్పుడో ఫస్ట్ కాపీతో సహా అంతా రెడీ అయిపోయింది. తమిళ వర్షన్ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యలో చైతూ కూడా ‘ప్రేమమ్’ మొదలుపెట్టడం, అది రిలీజవ్వడం జరిగిపోయాయి. ఇంత లేట్ అయినా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూడడం మాత్రం మర్చిపోలేనిది.

ప్రశ్న) కరన్సీ బ్యాన్ ఉన్న రోజుల్లో సినిమా విడుదల చేయడం రిస్క్ అనిపించలేదా?

స) కరన్సీ బ్యాన్‌ను తప్పుపట్టడానికి లేదు. నల్లధనాన్ని తరిమేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే! అయితే మేము ముందే మా సినిమా విడుదల తేదీని ప్రకటించేశాం. అప్పటికే అన్నీ సిద్ధమయ్యాయి. మళ్ళీ వాయిదా వేయడమంటే బాగుండదనే చెప్పిన తేదీకే వచ్చేశాం. కరన్సీ బ్యాన్ వల్ల 30% కలెక్షన్స్ తగ్గినా, మరో మూడు వారాలు సినిమా థియేటర్లలోనే ఉంటుంది కాబట్టి మున్ముందు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ‘ఏ మాయ చేశావే తరహా’లో ఫస్టాఫ్ నడిపి, సెకండాఫ్ అంతా యాక్షన్ వైపు వెళ్ళారెందుకని?

స) ఇది పూర్తిగా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఒక కథగా కాకుండా, హీరో పాత్ర ఎటు వెళ్తే సినిమా అలా సాగుతుంది. ఇలాంటి కథలో ఎన్ని జానర్లైనా ఉండొచ్చన్నది నా అభిప్రాయం. నాక్కూడా రెండు, మూడు జానర్స్ మిక్స్ చేసి ప్రయోగం చేయడం చాలా ఇష్టం. అది ఈ సినిమాతో నెరవేరింది. సెకండాఫ్‌కి ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా కథే మారిపోవడం కొందరికి బాగా నచ్చింది. ఇంకొందరు అస్సలు బాలేదు అన్నారు. ఏదేమైనా సినిమాపైన డిస్కషన్ జరగాలి. అది నేనెప్పుడూ కోరుకుంటూంటా.

ప్రశ్న) నాగ చైతన్యతో మరోసారి పనిచేయడం ఎలా అనిపించింది? ఏ మాయ చేశావే అప్పటికి, ఈ సినిమాకి ఆయనలో వచ్చిన మార్పు?

స) వ్యక్తిగా చై అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నాడు. సరదాగా తమ్ముడిలా ఉంటాడు. అతడ్ని డైరెక్ట్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్‌కు రెడీ అయినా కూడా తమిళ వర్షన్ కోసం లేట్ అవుతున్నా ఓపికగా ఉన్నాడు. ఇక హీరోగా అయితే చైతన్య స్థాయి పెరిగింది. సాహసం శ్వాసగా షూట్ అప్పుడు అంటూ ఉండేవాడిని, “ఈ సినిమాతో నువ్వు మాస్ సినిమాలు కూడా చేయొచ్చు” అని. ఇప్పుడు నిజంగానే మాస్ హీరో అవ్వగలిగే లుక్, స్టేటస్ తెచ్చుకున్నాడు. నేనైతే అతడితో ఇంకో సినిమా చేయడానికైనా రెడీ, చైతూకి ఆ ఫీలింగ్ ఉందో లేదో మరి! (నవ్వుతూ..)

ప్రశ్న) క్లైమాక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి కదా, దానిపై మీరేమంటారు?

స) ముందే చెప్పినట్టు ఏ సినిమాకైనా డిస్కషన్ ఉండాలి. అంతవరకూ రియలిస్టిక్‌గా, కాస్త డార్క్‌గా ఉన్న సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా కమర్షియల్ టచ్‌తో ఎండ్ చేశా. ఇది నేను కావాలని తీసుకున్న నిర్ణయమే! గౌతమ్ మీనన్ మాస్ సినిమా తీస్తే ఇలా ఉంటుందని, చివర్లో ఇచ్చిన టచ్ అన్నమాట! (నవ్వుతూ..). నిజం చెప్పాలంటే క్లైమాక్స్‌లో వచ్చే సబ్‌ప్లాట్‌ని డైలాగ్స్ ద్వారా కాకుండా, మాంటేజ్ సీన్లతో చూపాలనుకున్నా. అవి స్క్రిప్ట్‌లో కూడా ఉన్నాయి. కొన్ని అనుకోని కారణాల వల్ల అది షూట్ చేయడం కుదర్లేదు. అయినప్పటికీ చాలామంది ఈ క్లైమాక్స్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

న్లతో చూపాలనుకున్నా. అవి స్క్రిప్ట్‌లో కూడా ఉన్నాయి. కొన్ని అనుకోని కారణాల వల్ల అది షూట్ చేయడం కుదర్లేదు.

ప్రశ్న) తమిళ వర్షన్ వల్ల తెలుగుకి ఇబ్బందులు వచ్చాయి కదా.. భవిష్యత్‌లో ద్విభాషా చిత్రాలను తీయడం మానేస్తారా?

స) అది ద్విభాషా చిత్రం అవ్వడం వల్లనే వచ్చిన సమస్య అని చెప్పలేం. కొన్నిసార్లు పరిస్థితులు అలా మారిపోతాయి. నేనైతే ఏ సినిమా అనుకున్నా మొదట రెండు భాషల్లోనూ ఆ సినిమా చేయాలనే ఎక్కువగా ఆలోచిస్తూంటా. నా మేకింగ్ స్టైల్ కూడా ఎవ్వరికీ ఇబ్బంది పెట్టేదిగా ఉండదు కాబట్టి ద్విభాషా చిత్రంతో సమస్యేం లేదు.

ప్రశ్న) ధనుష్ సినిమా ఎంతవరకు వచ్చింది. విక్రమ్‌తో ఒక సినిమా చేస్తున్నారని వినిపించింది?

స) ధనుష్ సినిమా షూట్ జరుగుతోంది. అలాగే విక్రమ్‌తో సినిమా ఇంకా డిస్కషన్ స్టేజ్‌లో ఉంది, దాని గురించి ఇప్పుడే చెప్పలేను.

ప్రశ్న) చివరగా, సాహసం శ్వాసగా ఫలితం సంతృప్తినిచ్చిందా?

స) దర్శకుడిగా, నిర్మాతగా (తమిళంలో) నేనొక ప్రయోగం చేశా. అది ప్రేక్షకులకు కూడా నచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నా. తమిళంలో, తెలుగులో రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. రానున్న రోజుల్లో అంతా సెట్ అయి ఆ కలెక్షన్స్ మరింత పెరిగితే అంతకంటే కోరగలిగిందేమీ ఉండదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు