ఇంటర్వ్యూ : ప్రణిత సుభాష్ – నా పాత్ర చుట్టూనే ‘డైనమైట్’ కథ తిరుగుతుంది.

ఇంటర్వ్యూ : ప్రణిత సుభాష్ – నా పాత్ర చుట్టూనే ‘డైనమైట్’ కథ తిరుగుతుంది.

Published on Aug 27, 2015 4:31 PM IST

pranitha1
‘బావ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ ప్రణిత సుభాస్, పవన్ కళ్యాణ్ సరసన చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల బాపు బొమ్మగా మారిపోయింది. అలాంటి బాపు బొమ్మ మంచు విష్ణు సరసన నటించిన ‘డైనమైట్’ సినిమా సెప్టెంబర్ 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ గ్లామర్ తోనే ఆకట్టుకున్న ప్రణిత ఈ సినిమాలో స్టంట్స్ తో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా గురించి ప్రణిత చెప్పిన మరిన్ని విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ఫైనల్ గా సోలో హీరోయిన్ గా మొదటి తెలుగు చేయడం ఎలా అనిపించింది.?
స) చాలా గొప్పగా అనిపిస్తోంది. నా కెరీర్ కి ఈ మూవీ చాలా కీలకం మరియు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) డైనమైట్ లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) డైనమైట్ లో నేను ఓ మోడ్రన్ హైదరాబాది అమ్మాయిలా కనిపిస్తాను. అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాను, మంచు విష్ణు సాయంతో దాని నుంచి ఎలా భయటపడ్డాను అనేదే ఈ సినిమాలోని మిగిలిన కథాశం.

ప్రశ్న) మీ పాత్రకి డైనమైట్ లో ఎంత ప్రాధాన్యత ఉంటుంది.?
స) చెప్పాలంటే ఈ సినిమాలో నాదే కీలక పాత్ర, నా చుట్టూనే కథ తిరుగుతుంది. అలాగే నా పాత్ర ద్వారానే కథలో చాలా ట్విస్ట్ లు వస్తాయి.

ప్రశ్న) మీరు ఈ సినిమా కోసం రియల్ గా స్టంట్స్ చేసారట. వాటి గురించి కాస్త చెప్పండి.?
స) అవును.! డైనమైట్ లో నా పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటుంది, అలాగే చాలా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో వాటిని రియల్ గా చేసాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ చెయ్యడమే చాలా టఫ్ గా అనిపించింది.

ప్రశ్న) మంచు విష్ణుతో పనిచేయడం ఎలా ఉంది.?
స) ఫిల్మ్ మేకింగ్ విషయంలో మంచు విష్ణు చాలా డిఫరెంట్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఫిల్మ్ మేకింగ్ లో చాలా నాలెడ్జ్ ఉంది, అందుకే తన సినిమాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటాడు. షూటింగ్ లో నాకు చాలా హెల్ప్ చేయడమే కాకుండా, షూటింగ్ టైంలో నాకు ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ని కలిగించారు.

ప్రశ్న) ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే డైనమైట్ ఎంత్ డిఫరెంట్ గా ఉంటుంది.?
స) తెలుగు వెర్షన్ కోసం చాలా మార్పులు చేసాం. డైరెక్టర్ దేవకట్టా ఒరిజినల్ వెర్షన్ ని మరపించేలా ‘డైనమైట్’ ని మరింత కమర్షియల్ చేసారు.

ప్రశ్న) తెలుగు బాగా మాట్లాడుతున్నారు. స్పెషల్ గా ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా.?
స) అస్సలు తీసుకోలేదు.. నా స్టాఫ్ మరియు సెట్లో అందరితో తెలుగులో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. త్వరలోనే నా తెలుగు సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను.

ప్రశ్న) ఒక సినిమాకి సైన్ చెయ్యాలి అంటే ముందు మీరేమి చూస్తారు.?
స) నా వరకూ అయితే నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా పాత్రకి ఎంత రన్ టైం ఉంది అనేది చూడకుండా. నా పాత్రకి కథలో ఎంత ప్రాధాన్యత ఉందనేది చూస్తాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు ‘బహ్మోత్సవం’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి వారి గురించి త్వరలో అనౌన్స్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు