ఇంటర్వ్యూ : సంపత్ నంది – ‘గాలిపటం’ మూవీ నా గౌరవాన్ని పెంచేలా ఉంటుంది.

ఇంటర్వ్యూ : సంపత్ నంది – ‘గాలిపటం’ మూవీ నా గౌరవాన్ని పెంచేలా ఉంటుంది.

Published on Aug 7, 2014 5:09 PM IST

sampath-nandi
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది తన రెండవ సినిమాతోనే రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్న సంపత్ నంది తన దగ్గర అసిస్టెంట్స్ కి లైఫ్ ఇవ్వాలని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో మొదటగా నవీన్ గాంధీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘గాలిపటం’. ఆది హీరోగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడి నుండి డైరెక్టర్ గా మారిన సంపత్ నందితో కాసేపు ముచ్చటించాము. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) అసలు గాలిపటం ఎలా మొదలైంది.? దీనికి మీరు నిర్మాత ఎందుకయ్యారు.?

స) నేను, నవీన్ గాంధీ డైరెక్టర్ కాక ముందు నుంచి రూం మేట్స్. ఒకప్పుడు మేమిద్దరం స్క్రిప్ట్స్ పట్టుకొని బాగా తిరిగాం. నేను డైరెక్టర్ అయ్యి రచ్చ సినిమా పూర్తయ్యాక గబ్బర్ సింగ్ 2 సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నాను. అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ తెలుగులో మురుగదాస్, శంకర్, విదు వినోద్ చోప్రా, కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో లాగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం లేదు. మనం చేద్దాం స్క్రిప్ట్ వర్క్ నువ్వు చూస్కో మిగతావి మేము చూసుకుంటాం అన్నారు. ఆ తర్వాత ఒక పాయింట్ అనుకోని చెప్పాను అది నచ్చడంతో స్క్రిప్ట్ ఫినిష్ చేసాం. నవీన్ గాంధీ కూడా ఈ కాన్సెప్ట్ నేను హాండిల్ చేస్తానని చెప్పడంతో తనని డైరెక్టర్ గా ఎంచుకున్నాం.

ప్రశ్న) మరి లాస్ ఏంజల్స్ వారు ఈ మూవీ ప్రొడక్షన్ లో ఎలా భాగమయ్యారు.?

స) నా ఫ్రెండ్స్ ద్వారా లాస్ ఏంజల్స్ కిరణ్, విజయ్ లతో మంచి పరిచయం ఏర్పడింది. నేను షేర్ చేసుకునే విషయాలను, కొన్ని కాన్సెప్ట్ లను వినే వాళ్ళు.. అప్పటి నుంచే వాళ్ళకి నా కాన్సెప్ట్స్ బాగా నచ్చేవి కానీ మీరు ఎందుకు కమర్షియల్ సినిమాలే చేస్తారు, డిఫరెంట్ ట్రై చెయ్యండి అనే వాళ్ళు. ఈ కాన్సెప్ట్ అనుకున్నాక వాళ్ళు కథ విని బాగా నచ్చడంతో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు.

ప్రశ్న) ఈ సినిమాలో నిర్మాతగా కాకుండా, మిగతా విషయాల్లో మీ పార్ట్ ఎంత ఉంది.?

స) ఈ సినిమాకి స్క్రిప్ట్ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ మొత్తం నేనే రాసి ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు స్పెయిన్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు నాకు 2 నెలల టైం దొరికింది. ఆ టైంలో ఈ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ చేసాను. నవీన్ గాంధీకి నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అతను 100% న్యాయం చెయ్యగలడు కాబట్టే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాను.

ప్రశ్న) మరి ‘గాలిపటం’ సినిమా ఎలా ఉంటుంది.?

స) నా గత సినిమాలకి గాలిపటంకి అస్సలు సంబంధం ఉండదు. ఇదొక కొత్త జోనర్లో వస్తున్న సినిమా. హిందీలో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్ టెయిల్’, ‘జబ్ వుయ్ మెట్’ సినిమాల తరహాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. సినిమాలో పాత్రలన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి, ఎక్కడా సినిమాటిక్ పాత్రలు, మెలో డ్రామా ఉండదు. ప్రతి పాత్రకి జస్టిఫికేషన్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం నా గౌరవాన్ని పెంచేలా ఉంటుంది.

ప్రశ్న) మీరు చెప్పిన దాని ప్రకారం రొటీన్ కి భిన్నంగా చేసిన ఈ సినిమాని మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారంటారా.?

స) నేను ‘ఏమైంది ఈవేళ’ సినిమా వచ్చినప్పుడు కూడా విమర్శకుల పరంగా నా మీద నెగటివ్ ఫీడ్ బాక్స్ వచ్చాయి. కానీ ఆ సినిమా ఓ కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఆ తర్వాత అదే జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలానే అవుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు తమిళం, హిందీలో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి, కానీ తెలుగులో చేయడానికి భయపడుతున్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ – స్క్రీన్ ప్లేలో కొత్తగా చూపించడానికి ట్రై చేసాను.

ప్రశ్న) సెన్సార్ నుండి ఏ సర్టిఫికేట్ వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమా కేవలం యువతకు మాత్రమే అనుకోవచ్చా.?

స) అలా ఉండదు. అన్ని వర్గాల వారు ఈ సినిమాని చూడవచ్చు. ఈ మధ్య సెన్సార్ వారు యాక్షన్ ఎక్కువైనా, చెప్పేది రూడ్ గా చెప్పినా ఏ ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక లవ్ మేకింగ్ సీన్ ఉంటుంది. అది కథకి చాలా కీలకం. అది తీసేస్తే యు/ఏ ఇస్తాను అన్నారు. కానీ కథకి అది కీలకం అని ‘ఏ’ తీసుకున్నాం.

ప్రశ్న) ఇలాంటి జోనర్ ఆదికి కొత్త అని చెప్పాలి. మీరు రాసుకున్న పాత్రకి ఆది ఎంతవరకూ న్యాయం చేసాడు.?

స) మీరన్నట్టు ఆదికి ఇది కొత్త జోనర్ సినిమా అనే చెప్పాలి. కానీ నేను రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఇప్పటి వరకూ ఆదిలో యాక్షన్, డాన్సులు చూసారు ఈ సినిమాలో ఆది పెర్ఫార్మన్స్ చాలా సెటిల్ గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా యాక్టింగ్ కంటే ఆన్ స్క్రీన్ పై తన బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. ఓ కొత్త ఆదిని ఇందులో చూస్తారు.

ప్రశ్న) డైరెక్టర్ గా చేసారు.. ఇప్పుడు నిర్మాతగా మారారు.. ఈ రెండిటిలో మీకు ఏది కష్టం అనిపించింది.?

స) నా పరంగా నిర్మాతగా చేయడమే కష్టం. ఎందుకంటే నాకు రైటర్ గా, డైరెక్టర్ గా అనుభవం ఉంది. కానీ నిర్మాతగా జీరో నాలెడ్జ్. ప్రొడక్షన్ జరిగే టప్పుడు, డిస్ట్రిబ్యూటర్స్ సైడ్ గురించి నాకు ఏం తెలియదు అందుకే నాతో పాటు 8 ఏళ్ళగా ట్రావెల్ చేస్తున్న ఎన్.ఎస్ కుమార్ గారే ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నారు. కేవలం నేను చెక్ ల మీద సైన్ మాత్రమే పెట్టాను.

ప్రశ్న) సినిమా సినిమాకి పెద్ద పెద్ద హీరోలతో పని చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎక్కువగా ప్రెజర్ ఫీలయ్యారు.?

స) నేను ఎంత ప్రెజర్ ఫీలయినా అది కేవలం స్క్రిప్ట్ రాసుకునే టైంలోనే తీసుకుంటాను. ఒకసారి స్క్రిప్ట్ పూర్తయ్యి అంతా ఓకే అనుకున్న తర్వాత అస్సలు ప్రెజర్ ఫీలవ్వను.

ప్రశ్న) మీరు అనుకున్న దాని కంటే ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి గల కారణం ఏమిటి.?

స) మీరన్నది నిజమే.. మేము అనుకున్నదాని కంటే కొంచెం పెరిగింది. అనుకున్న సీన్స్ బాగా రావడానికి, టెక్నికల్ పరంగా బెస్ట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సినిమా బడ్జెట్ పెరిగిందే తప్ప అనవసరంగా కాదు. అనుకున్నట్టుగానే 60 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసాం.

ప్రశ్న) మీ పరంగా ‘గాలిపటం’కి మేజర్ హైలైట్స్ ఏమిటి.?

స) ‘గాలిపటం’ విషయంలో నా పరంగా డైలాగ్స్, మ్యూజిక్ అమ్ద్రియు క్లైమాక్స్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని అనుకుంటున్నాను.

ప్రశ్న) మీరు కమర్షియల్ సినిమాలు చేసారు, అలాగే డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నారు. పర్సనల్ గా మీకు ఏది బాగా నచ్చింది.?

స) నా వరకూ రెండూ బాగుంటాయి. ఒక రైటర్ గా ‘గాలిపటం’ లాంటి సినిమా రాసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. డైరెక్టర్ గా మాత్రం కమర్షియల్ సినిమా చేయడానికే ఇష్టపడతాను.

ప్రశ్న) ‘గాలిపటం’ కోసం ఆడియన్స్ ఎందుకు థియేటర్స్ కి రావాలంటారు.?

స) ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. తెలుగు ప్రేక్షకులు ఫ్రెష్ నెస్ కోసం గాలిపటం చూడాలి.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం నేను ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా డైరెక్షన్ వైపే బిజీగా ఉన్నాను. ఈ సినిమాకి మంచి రిజల్ట్ వస్తే, నేను డైరెక్ట్ చేసే సినిమా తర్వాత నా ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి సంపత్ నందికి ఆల్ ది బెస్ట్ చెప్పాము..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు