ఆకాశాన్నంటుతున్న ‘కబాలి’ టికెట్ల ధరలు

kabali1

‘రజనీకాంత్’ నటించిన ‘కబాలి’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ల లిస్ట్, ప్రీమియర్ షోలు వంటి అంశాల్లోనేగాక ఇంకో విషయంలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. అదే టికెట్ల ధరలు. ప్రస్తుతం ఎవరి నోట విన్న ‘కబాలి టికెట్లు ఉన్నాయా, కబాలి టికెట్లు దొరకడం లేదు’ అన్న మాట తప్ప మరోమాట వినిపించడం లేదు. జూలై 22 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా 4000 పై చిలుకు థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్నప్పటికీ టికెట్లు కొరత ఏర్పడింది.

ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే టికెట్లు దొరక్కపోగా టికెట్ల ధరలు సైతం సాధారణ ధర రూ .120 కంటే నాలుగైదు రెట్లు పెరిగి రూ. 500 వరకూ పలుకుతున్నాయి. పైగా కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను ముందుగానే కార్పొరేట్ వ్యక్తుల చేతికందిచేస్తుండటంతో అభిమానులకు టికెట్లు దొరక్క పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో కొన్ని కార్పొరేట్ కంపెనీలు కబాలి విడుదల రోజు ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించాయి.

 

Like us on Facebook