రవితేజగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు – కళ్యాణ్ కృష్ణ

రవితేజగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు – కళ్యాణ్ కృష్ణ

Published on May 23, 2018 6:25 PM IST

రెండు వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం రవితేజతో ‘నేల టిక్కెట్టు’ అనే సినిమా చేశారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్న కళ్యాణ్ కృష్ణ గతంలో రవితేజ తనకిచ్చిన సపోర్ట్ ను గుర్తుచేసుకున్నారు. కెరీర్ మొదట్లో రవితేజగారికి ఈ కథ చెప్పాను అన్న ఆయన కథ విన్న వెంటనే రవితేజ సినిమా చేస్తానని మాటిచ్చినట్టు తెలిపారు.

కానీ రెండు సినిమాలు ఒప్పుకుని ఉన్నానని, వాటి తర్వాత చేస్తానని, ఈలోపు ఏదైనా అవకాశమొస్తే చేసుకోమని అన్నారు. అప్పుడే నేను ‘సోగ్గాడే చిన్ని నాయన, రరాండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలు చేశాను. ఆ తరవాత రవితేజగారు ఒప్పుకున్న రెండు సినిమాలు పూర్తయ్యాక నాతో సినిమా మొదలుపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

మాస్, క్లాస్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించగా మాళవిక శర్మ కథానాయకిగా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు