ఆ దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా !

ఆ దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా !

Published on Mar 18, 2018 4:11 PM IST

కళ్యాణ్ రామ్ డైరెక్టర్ విరించి వర్మ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఆనంది ఆర్ట్స్ సంస్థలో జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ ఏడాది ద్వితియార్ధంలో సినిమా ప్రారంభం కానుంది. కుటుంభ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో క్లాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తుండడం విశేషం. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం నిర్మాతలు తెలియజేయనున్నారు. ఉగాది పండగ రోజున సినిమాను అధికారికంగా అనౌన్స్ చెయ్యడం జరిగింది. కళ్యాణ్ రామ్ నటించిన ఎం.ఎల్.ఎ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు