సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తి సినిమా !
Published on Nov 2, 2017 3:32 pm IST

తమిళంతో పాటు తెలుగులో కూడా సమాన క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తి త్వరలో మరొక సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అదే ‘ఖాకి’. తమిళం, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని హెచ్.వినోత్ డైరెక్ట్ చేశారు. ఇదివరకే విడుదలైన్ ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ హైప్ నెలకొంది.

కొద్దిసేపటి క్రితమే ఏ చిత్రం యొక్క తమిళ ఆడియో విడుదలగా తెలుగు ఆడియో ఈరోజు సాయంత్రం రిలీజ్ కానుంది. అంతేగాక చిత్రం యొక్క తమిళ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్రాన్ని నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది.

 
Like us on Facebook