విజయ్ ‘కత్తి’ తెలుగులో రీమేక్ కానుందా.?

విజయ్ ‘కత్తి’ తెలుగులో రీమేక్ కానుందా.?

Published on Oct 23, 2014 1:31 PM IST

kathi
తమిళ స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా నిన్న తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంతో ప్రేక్షకులంతా ఈ దీపావళి సీజన్ లో థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. గతంలో మురుగదాస్ – విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి’ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఈ కత్తి సినిమాని కూడా అక్టోబర్ 31న తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

కానీ తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కత్తి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణం కొంతమంది నిర్మాతలు ఈ సినిమా తెలుగుకి కూడా బాగా సెట్ అవుతుంది, కుదిరితే రీమేక్ చేద్దాం అని చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ చర్చలు జరుపుతున్న నిర్మాతలు రీమేక్ కి సిద్దమైతే తెలుగు వెర్షన్ ని ఇక రిలీజ్ చెయ్యరు. కానీ ఇప్పుడు చర్చలు మొదలైన ఈ విషయం పై పూర్తి క్లారిటీ రావడానికి మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు