రికార్డుల వేట మొదలుపెట్టేసిన చిరు!!

రికార్డుల వేట మొదలుపెట్టేసిన చిరు!!

Published on Dec 9, 2016 4:00 AM IST

khaidi
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం. 150’ కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్నీ అంచనాలను అంతకంతకూ పెంచేయగా, నిన్న విడుదలైన టీజర్ ఆ అంచనాలన్నింటినీ తారాస్థాయికి తీసుకెళ్ళింది. చిరు స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ కలిపి ఈ టీజర్ అభిమానులకు పండగలా నిలిచింది. ఇక నిన్న సాయంత్రం ఆరు గంటలకు విడుదలైన టీజర్, విడుదలవ్వడంతోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది.

అదేవిధంగా యూట్యూబ్‌లో కేవలం మూడు గంటల్లోనే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగులో అత్యంత త్వరగా 1 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాల్లో ఖైదీ ఇప్పుడు మొదటి స్థానం సొంతం చేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జనవరి 11న సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు