‘కృష్ణాష్టమి’ టీం ఇస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ఇదే!

‘కృష్ణాష్టమి’ టీం ఇస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ఇదే!

Published on Dec 23, 2015 4:40 PM IST

Krishnashtami
కమెడియన్ నుంచి కామెడీ హీరోగా, ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారిన సునీల్ గత ఏడాది వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ తర్వాత చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా జనవరిలో రిలీజ్ కానుంది. కృష్ణాష్టమి కానుకగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అన్ని పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఈ చిత్ర టీం క్రిష్మాస్ కానుక ఓ స్పెషల్ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. క్రిస్మస్ రోజున అనగా డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు ఓ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే త్వరలోనే ఆడియో రిలీజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. దినేష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గాల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సునీల్ ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలే పెట్టుకొని ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు