బాలయ్య ‘లెజెండ్’కు ఏడాది!

బాలయ్య ‘లెజెండ్’కు ఏడాది!

Published on Mar 28, 2015 9:21 AM IST

Legend
గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై.. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా, ‘లెజెండ్’. మార్చి 28, 2014న విడుదలైన ఈ సినిమా నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఇటు కలెక్షన్ల పరంగానూ, అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకున్న లెజెండ్.. లాంగ్ రన్‌లో కూడా స్టడీగా నిలబడింది. ప్రస్తుతం ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ప్రదర్శితమౌతోన్న ఈ సినిమా, ఆ థియేటర్లలో ఏడాది పూర్తి చేసుకుంది. బాలయ్య తాజా చిత్రం లయన్ ఆడియో వేడుక రోజునే.. లెజెండ్ వేడుకను కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇక బాలయ్య తాజా చిత్రం లయన్ విషయానికి వస్తే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న విడుదలవనుంది. విడుదలకు ముందే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ఏకంగా 6కోట్ల రూపాయలకు అమ్ముడై సినిమాపై అంచనాల్ని పెంచింది. సత్యదేవా దర్శకుడిగా పరిచమవుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు