త్వరలో యూరప్ వెళ్ళనున్న రజినీ ‘లింగ’

త్వరలో యూరప్ వెళ్ళనున్న రజినీ ‘లింగ’

Published on Sep 1, 2014 5:47 PM IST

lingaa

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ ‘లింగ’. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శిమోఘలోని లింగనమక్కి డామ్ వద్ద జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం కొన్ని సాంగ్స్ కోసం యూరప్ వెళ్లనున్నారు. అక్కడి అందమైన లోకేషన్స్ లో రజినీకాంత, అనుష్క లపై సాంగ్స్ షూట్ చేయనున్నారు. అక్కడి నుంచి తిగిరాగానే మిగిలి ఉన్న టాకీ పార్ట్ ని పూతి చేయనున్నారు.

వినాయక చవితి కానుకగా లింగ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. రజినీ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు