‘స్టార్ మా’ సొంతం చేసుకున్న ‘S/O సత్యమూర్తి’ రైట్స్

‘స్టార్ మా’ సొంతం చేసుకున్న ‘S/O సత్యమూర్తి’ రైట్స్

Published on Mar 3, 2015 8:30 AM IST

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న సినిమా ‘సన్ అఫ్ సత్యమూర్తి'(వర్కింగ్ టైటిల్). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అక్కడ ఈ చిత్ర టీం అల్లు అర్జున్ – సమంతలపై సాంగ్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్పెయిన్ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోతాయి.

పలువురి మధ్య జరిగిన పోటీలో స్టార్ మా వారు ‘సన్ అఫ్ సత్యమూర్తి’ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు. అది కూడా ఓ భారీ ప్రైజ్ కి తీసుకున్నారు. రిలీజ్ కి ముందే ఓ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడు పోవడం అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఇందులో ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఈ చిత్ర టీం అంటోంది. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు