తన అబ్బాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రశంసించిన మహేష్ బాబాయ్

తన అబ్బాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రశంసించిన మహేష్ బాబాయ్

Published on May 27, 2015 8:19 AM IST

Mahesh_Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు అడపాదడపా తన సినిమాలకు సంబంధించిన విషయాలతో ట్వీట్ లు వేస్తూ అభిమానులను అలరిస్తూ వుంటాడు. అయితే ఈసారి మహేష్ బాబాయ్ వరసకు తన అబ్బాయ్ అయిన నవీన్ చిత్రంపై ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు.

మాజీ హీరోయిన్ విజయనిర్మల మనవడు, నరేష్ కొడుకు అయిన నవీన్ ని ఇటీవలే ఇండస్ట్రీలో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల సైతం పాలుపంచుకున్నారు. నవీన్ తొలిచిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా ఫస్ట్ లుక్ చాలా క్రియేటివ్ గా వుందని మహేష్ ట్విట్టర్ లో తెలిపాడు. అప్పటిదాకా ఎవరికీ పెద్ద తెలియని ఈ చిత్రంపై అప్పట్నుంచి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మహేషా మజాకా…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు