మహేష్ బాబు – పూరి సినిమా టైటిల్ ‘రోగ్’

మహేష్ బాబు – పూరి సినిమా టైటిల్ ‘రోగ్’

Published on Oct 20, 2014 3:30 PM IST

mahesh_puri
సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్ ‘ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని ఇది వరకే తెలియజేశాం. ఇప్పటికే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసాడు. ఇక ఫైనల్ గా మహేష్ బాబు విని ఓకే చెయ్యడం మాత్రమే మిగిలి ఉంది.

ఇప్పుడే తెలిసిన తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ మహేష్ బాబు సినిమాకి ‘రోగ్’ అనే టైటిల్ ని నిర్ణయించాడు. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 99% ఈ టైటిల్ ఖరారని సమాచారం. ప్రతి సినిమాకి డిఫరెంట్ లేదా నెగటివ్ టైటిల్స్ పెట్టడంలో తనకంటూ ఓక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరి జగన్నాధ్ పెట్టిన ఈ ‘రోగ్’ అనే టైటిల్ ని ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ సినిమాకి కమిట్ అయ్యి ఉన్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అలాగే పూరి జగన్నాధ్ కూడా ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక మహేష్ బాబు – పూరిల సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు