మాస్ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా ?
Published on Jul 3, 2017 9:34 am IST


ప్రస్తుతం ఇటు మురుగదాస్ ‘స్పైడర్’, అటు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ వంటి సినిమాలు షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ తన తర్వాతి ప్రాజెక్టులపై ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తవగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న మహేష్ ఆ తర్వాత యాక్షన్ సినిమా చేసే యోచనలో ఉన్నారని వినికిడి.

అది కూడా మాస్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో కావడం విశేషం. ఈ మధ్య చర్చల్లో కూర్చున్న ఈ ఇద్దరు భవిష్యత్తులో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారమూ బయటకు రాలేదు. అన్నీ కుదిరితే మెగాస్టార్ చిరంజీవితో బోయపాటి చేయనున్న సినిమా తర్వాత వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్సుంది.

 
Like us on Facebook