ఆర్.ఎఫ్.సిలో మహేష్ తో స్టార్స్ సందడి.!

ఆర్.ఎఫ్.సిలో మహేష్ తో స్టార్స్ సందడి.!

Published on Mar 6, 2015 2:10 PM IST

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇటీవలే ఈ చిత్ర పొల్లాచ్చిలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది. ప్రసతుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు ఈ సినిమాలో మెయిన్ రోల్స్ చేస్తున్న మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఈ కాంబినేషన్ సీన్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా అనగా మార్చి 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు