ఎట్టకేలకు కరుణించిన మురుగదాస్ !

ఎట్టకేలకు కరుణించిన మురుగదాస్ !

Published on Feb 24, 2017 4:13 PM IST


2016 లో విడుదలైన మహేష్ బాబు చిత్రం ‘బ్రహ్మోత్సవం’ బాక్సాఫీస్ ముందు పరాజయం పొందడంతో బాగా గ్యాప్ తీసుకున్న మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా మొదలుపెట్టి అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మొదలై చాలా రోజులు కావడంతో అభిమానులు ఎప్పటికప్పుడు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

కానీ మురుగదాస్ మాత్రం ఇన్నాళ్లు వాళ్లను ఏమాత్రం కనికరించలేదు. కనీసం సినిమా టైటిల్ ఏమిటో కూడా చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ పూర్తి నిరుత్సాహంతో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మురుగదాస్ ను టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడని అడుగుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళకు ఉపశమనంతో పాటు షాకింగ్ సప్రైజ్ అన్నట్టు మురుగదాస్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ డేట్స్ లాటి చిన్నచిన్నవి కాకుండా ఏకంగా జూన్ 23న సినిమా థియేటర్లలోకి దిగుతుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటనతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇకపోతే మే 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు కావడంతో ఆరోజు సినిమా ట్రైలర్ వంటిది ఏదైనా రిలీజయ్యే ఛాన్సుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు