ఫ్రాన్స్‌లో నాగార్జున-కార్తి సినిమా షూటింగ్!

ఫ్రాన్స్‌లో నాగార్జున-కార్తి సినిమా షూటింగ్!

Published on Aug 1, 2015 2:55 PM IST

nag-thammanna
నాగార్జున – కార్తీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ సినిమా ఎక్కడా ఆగకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మధ్యే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టిన టీమ్, ప్రస్తుతం ఆ షెడ్యూల్‌తో బిజీబిజీగా గడిపేస్తోంది.

ఈ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే పదిహేను రోజులకు పైనే ఫ్రాన్స్‌లో షూటింగ్ జరగగా, మరో పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇక ఫ్రాన్స్‌లో షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. కార్తీ, తమన్నాలతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. యూరప్ షెడ్యూల్‌లో తెలుగు సినిమాల్లో ఇంతవరకూ చూడనటువంటి ఓ భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశారు. షూటింగ్ స్పాట్‌లో నాగార్జున, కార్తి, తమన్నాలు సరదాగా దిగిన ఫోటో కూల్‌గా ఉంది కదూ!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు