దసరాకి సిద్దమవుతున్న నాగ శౌర్య !

దసరాకి సిద్దమవుతున్న నాగ శౌర్య !

Published on Feb 17, 2018 9:09 AM IST


ఇటీవలే ‘ఛలో’ చిత్రంతో ఘనమైన కమర్షియాయ్ల హిట్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య కొద్దిగా బ్రేక్ తీసుకుని తన తర్వాతి సినిమాలకు సిద్దమవుతున్నారు. ఆయన తర్వాతి రెండు సినిమాల్ని కొత్త దర్శకులే డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఆ ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘నర్తనశాల’. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకుని మార్చి నుండి మొదలుకానుంది.

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను దసరా నాటికి పూర్తిచేసి ప్రేక్షకులకందించాలని నాగ శౌర్య భావిస్తున్నారు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మించనున్నారు. అంతేగాక సాయి శ్రీరామ్ దర్శకత్వంలో కూడ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను త్వరలో ప్రారంభించనున్నాడు ఈ యువ హీరో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు